Site icon 10TV Telugu

Darshan : ఆ హీరోపై కేసు పెట్టిన 35 మంది మహిళలు.. చిక్కుల్లో స్టార్ హీరో

Darshan

Darshan

Darshan : కన్నడ సూపర్ స్టార్ దర్శన్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే భార్య, గర్ల్ ఫ్రెండ్ మధ్య గొడవలతో ఇరుకున పడ్డ ఈ స్టార్‌పై మరో కొత్త కేసు నమోదైంది.

Darshan 2

Sundeep Kishan : మీమర్ పై సందీప్ కిషన్ ఆగ్రహం.. హీరోయిన్స్‌ గురించి మరి అంత చీప్‌గా..

దర్శన్ నటించిన ‘కాటేరా’ గతేడాది డిసెంబర్‌లో విడుదలై విజయ దుందుభి మోగించింది. కేవలం కన్నడ భాషలో మాత్రమే రిలీజైన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది. ఈ సక్సెస్ దర్శన్‌ను ఎక్కువ రోజులు సంతోషంగా ఉండనీయలేదు. ఇప్పటికే ఓవైపు భార్య విజయలక్ష్మి ప్రియురాలు పవిత్రా గౌడ వార్‌తో చిక్కుల్లో ఉన్న దర్శన్‌పై కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదులు అందాయట. ఇది చాలదన్నట్లు ఆయనపై 35 మంది మహిళలు కంప్లైంట్ చేశారట.

Allu Ayaan : షారుఖ్ ఖాన్ పాటని అల్లు అర్జున్ కొడుకు.. ఎంత బాగా పాడుతున్నాడో చూడండి..

బెంగళూరులోని పుట్టెనహళ్లి పీఎస్‌లో శ్రీ శక్తి మహిళా స్వయం సహాయక సంఘానికి చెందిన 35 మంది మహిళలు పిర్యాదు చేసారట. కన్నడ నిర్మాత ఉమాపతిపై అసభ్య పదజాలం వాడటంతో పాటు మహిళలను కించ పరుస్తూ మాట్లాడారనే అభియోగాలపై ఆయనపై కేసు నమోదైందట. అంతేకాదు సభలు, సమావేశాల్లో సైతం దర్శన్ మహిళలపై నోరు పారేసుకుంటున్నారంటూ మహిళలు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుపై బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. దర్శన్ ఏం వివరణ ఇచ్చుకుంటారో తెలియాల్సి ఉంది.

 

Exit mobile version