Telugu Movie Releases: ఒకేసారి 6 సినిమాలు.. మూవీ లవర్స్‌కి పండగే!
తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఒకేసారి ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రిపబ్లిక్ సినిమాతో ఈ శుక్రవారం మొదలైన ఈ సినిమాల పంట అక్టోబర్ నెల మొత్తం ..
- Naresh Mannam
- Published On : October 1, 2021 / 05:55 PM IST
Telugu Movie Releases
Telugu Movie Releases: తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఒకేసారి ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రిపబ్లిక్ సినిమాతో ఈ శుక్రవారం మొదలైన ఈ సినిమాల పంట అక్టోబర్ నెల మొత్తం కొనసాగుతూనే ఉంటుంది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ తో సినిమా లవర్స్ కి కొంత కొరతగా ఫీలవుతున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో సినిమా పండగ కొనసాగుతుంది.
Nivetha Pethuraj: అందానికే కేరాఫ్ అడ్రస్ ఈ మలయాళ కుట్టీ
ఇప్పటికే లవ్ స్టోరీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంటే.. వెంటవెంటనే అక్టోబర్ నెల సినిమా జాతరగా మారబోతుంది. ఈ శుక్రవారం రిపబ్లిక్ విడుదల కాగా వచ్చే వారం అక్టోబర్ 8న వైష్ణవ తేజ్ కొండపోలం సినిమా విడుదల కానుంది. ఉప్పెన లాంటి సూపర్ హిట్ తర్వాత వైవిధ్య దర్శకుడిగా పేరున్న క్రిష్ జాగర్లమూడితో కలిసి వైష్ణవ తేజ్ చేస్తున్న ఈ సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ లాంటి గ్లామర్ కూడా తోడవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.
Acharya: క్రిస్టమస్‌కా.. సంక్రాంతికా.. మెగాస్టార్ రాక ఎప్పుడు?
ఇక ఆ తర్వాత అక్టోబర్ 14న ఎనిమీ, మహాసముద్రం విడుదల కానుండగా.. 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, వరుడు కావలెను సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. విశాల్, ఆర్య లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఎనిమీ డబ్బింగ్ సినిమా తెలుగులో భారీగా విడుదల చేయనుండగా.. సిద్దార్ధ్, శర్వానంద్ కలిసి నటిస్తూ ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మహాసముద్రం మీద కూడా టాలీవుడ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
Pawan Kalyan: జనసేనానిని కలిసిన నిర్మాతలు.. సయోధ్య కోసమేనా?
అక్టోబర్ 15న అఖిల్ అక్కినేని పూజ హెగ్డేతో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా దిగిపోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం వేచిచూస్తూ బ్యాచలర్ తెరకెక్కించగా ట్రైలర్ ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఇక యువజంట నాగసౌర్య, రీతువర్మ వరుడు కావలెను కూడా తామేమీ తక్కువ కాదని అదేరోజు వస్తుండడంతో తెలుగు సినీ అభిమానులకు కన్నుల పండగగా మారింది.
