Pawan Kalyan: జనసేనానిని కలిసిన నిర్మాతలు.. సయోధ్య కోసమేనా?

ఏపీ ప్రభుత్వం.. జనసేన పార్టీ మధ్య ఇప్పుడు పొలిటికల్ హీట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: జనసేనానిని కలిసిన నిర్మాతలు.. సయోధ్య కోసమేనా?

Pawan Kalyan (1)

Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం.. జనసేన పార్టీ మధ్య ఇప్పుడు పొలిటికల్ హీట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపగా.. తెలుగు సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు దీనిపై మిశ్రమంగా స్పందించారు.

Bahubali : బాహుబలి వెబ్ సిరీస్ ఆగిపోయిందా??

తెలుగు సినీ నిర్మాతల మండలి ఇప్పటికే పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటే.. మరికొందరు నిర్మాతలు, కొందరు హీరోలు కూడా పవన్ వ్యాఖ్యలపై మౌనంగా ఉండిపోయారు. ఒకరిద్దరు మాత్రం ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తులు కూడా చేసుకున్నారు. ఇక నిర్మాతలలో దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులతో కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడం ఈ ఎపిసోడ్ లో తీవ్ర చర్చకి దారితీసింది.

South Heroines : టాప్ హీరోయిన్స్.. కొత్త కండీషన్స్..?

ఇప్పటికే మంత్రి పేర్ని నానిని క‌లిసిన నిర్మాత దిల్ రాజు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై విచారం వ్య‌క్తం చేయగా.. సీఎం జగన్ ను కలిసిన నిర్మాత అల్లు అర‌వింద్ సినీ ప‌రిశ్ర‌మ‌ను ర‌క్షించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, ఈరోజు నిర్మాత‌లు దిల్ రాజు, డీవీవీ దాన‌య్య, మైత్రీ మూవీ మేక‌ర్స్ న‌వీన్ యేర్నేని, యూవీ క్రియేష‌న్స్ వంశీ రెడ్డి, ఏసియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్ ఇత‌ర నిర్మాత‌లు ప‌వ‌న్ ను కలిసి సినిమా సమస్యలపై చర్చించారు.

Pawan Kalyan : సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఒంటరి అవుతున్నారా..?

కాగా, ఇప్పటికే సీఎం, మంత్రులతో నిర్మాతలు భేటీ, సంప్రదింపులు జరపడం.. నేడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. పక్కా రాజకీయంగా మారిన సినిమా, సినిమా టికెట్ల వ్యవహారాన్ని సినిమా పెద్దలు ఇంకా సాగదీస్తే నష్టంగా భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ప్రభుత్వంతో సానుకూలంగా ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మాతలు పవన్ తో సంప్రదింపులు జరిపినట్లుగా కనిపిస్తుంది.