71st National Film Awards 2025: నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో దుమ్మురేపిన టాలీవుడ్.. ఏకంగా ఏడు అవార్డులు.. ఫుల్ లిస్ట్..
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె) - గాంధీ తాత చెట్టు

నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో టాలీవుడ్ దుమ్మురేపింది. ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. భగవంత్ కేసరి, హనుమాన్, బలగం, బేబీ, గాంధీ తాత చెట్టు సినిమాలకు మొత్తం కలిపి ఏడు అవార్డులు దక్కాయి.
ఏయే అవార్డులు?
- జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్ కేసరి” కి అవార్డు దక్కింది.
- హనుమాన్ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ నేషనల్ అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ నందు, పృథ్వీ.
- ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ – హనుమాన్
- బలగం సినిమాలోని “ఊరు పల్లెటూరు” సాంగ్‌కు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ గీత రచయిత కాసర్ల శ్యామ్.
- ఉత్తమ్ స్క్రీన్ ప్లే – బేబీ (సాయి రాజేష్ నీలం (షేరింగ్))
- బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- బేబీ (పివి ఎన్ఎస్ రోహిత్)
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె) – గాంధీ తాత చెట్టు
ఏ సినిమాలో ఏం చూపించారు?
భగవంత్ కేసరి
నందమూరి బాలకృష్ణ పవర్‌ఫుల్ రోల్‌తో కనపడ్డారు. మహిళల సామర్థ్యాన్ని ప్రోత్సహించేలా తీసిన యాక్షన్ డ్రామా ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హనుమాన్
హనుమంతుడి ద్వారా శక్తి లభించి, హీరో సాహసాలు చేసే సినిమా ఇది. సూపర్ హీరో కోణంలో చూపించిన విజువల్ వండర్ “హనుమాన్”. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సూపర్ హీరో జానర్‌లో ఓ మార్గాన్ని చూపినట్లు చెప్పుకోవచ్చు.
బలగం
పల్లె నేపథ్యంలో కుటుంబ బంధాలను, మానవ సంబంధాలను చూపిన భావోద్వేగ కథ. వేణు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది.
బేబీ
ప్రేమ, స్వార్థం, లవ్ ఫెయిల్యూర్‌ను చూపే సినిమా ఇది. ఈ ఎమోషనల్ డ్రామాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటన సినిమాకు బలంగా నిలిచింది.
గాంధీ తాత చెట్టు
ప్రకృతి పరిరక్షణ, పిల్లల ఆలోచనల ద్వారా సామాజిక సందేశాన్ని అందించిన సినిమా ఇది.