7G Brindavan Colony sequel script completed and shooting starts soon
7G Brindavan Colony : 2004 లో ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం కొడుకు రవి కృష్ణని (Ravi Krishna) హీరోగా పరిచయం చేస్తూ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన సినిమా ‘7G బృందావన్ కాలనీ’. సోనియా అగర్వాల్ (Sonia Agarwal) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ముందుగా తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని.. తెలుగులో కూడా రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ మూవీని ఇప్పుడు సెప్టెంబర్ 22న రీ రిలీజ్ చేసి మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
Harsha Sai : మొదటి మూవీకే ‘మెగా’ టైటిల్‌ని తీసుకున్న యూట్యూబర్ హర్ష సాయి.. టీజర్ చూశారా..?
తాజాగా ఈ రీ రిలీజ్ ట్రైలర్ ని ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్, ఎ ఎం రత్నం పాల్గొన్నారు. ఇక ఇదే వేదిక పై సీక్వెల్ గురించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీ సీక్వెల్ రాబోతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకనిర్మాతలు ఇప్పటికే పలు వేదికల పై ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వచ్చారు. తాజాగా ఈ ఈవెంట్ లో సీక్వెల్ పనుల గురించి అప్డేట్ ఇచ్చారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. మొదటి పార్ట్ ని తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు.
Anasuya Bharadwaj : నన్ను ద్వేషించేవారికి ఓ సందేశం.. అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్
ఈ పార్ట్ 2 పనులు వచ్చే నెల నుంచి మొదలు కానున్నాయని వెల్లడించారు. ఈ చిత్రానికి కూడా యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడట. ఇప్పటి జనరేషన్ పరిస్థితులకు అనుగుణంగా ఈ మూవీ కథని సిద్ధం చేశారట. రవి కృష్ణ విభిన్నమైన లుక్ లో కనిపించనున్నాడని తెలియజేశాడు. కాగా 7G బృందావన్ కాలనీ సినిమాని ఇప్పటి వరకు తాను ఒక్కసారి మాత్రమే పూర్తిగా చూసినట్లు చెప్పుకొచ్చాడు రవి కృష్ణ. ఆ సినిమా ఎండింగ్ చూస్తే తాను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడట. అందుకనే ఆ మూవీని పూర్తిగా చూడలేనని చెప్పుకొచ్చాడు.