RRR : ఆస్కార్ అందుకున్న కీరవాణి పాప్ స్టైల్‌లో స్పీచ్.. తెలుగు భాషలోని గొప్పతనాన్ని వివరిస్తూ చంద్రబోస్..

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం నేడు చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అందుకున్న మొదటి భారతీయ సినిమాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో నిలిచిపోనుంది. ఇక ఆస్కార్ అందుకున్న తరువాత కీరవాణి, చంద్రబోస్..

RRR : టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం నేడు చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అందుకున్న మొదటి భారతీయ సినిమాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో నిలిచిపోనుంది. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్స్ నిలవగా.. రేస్ లో ప్రపంచ సినిమాలతో పోటీ పడి ఆస్కార్ ని గెలుచుకుంది. ఈ పాటని ఎం ఎం కీరవాణి స్వరపరిచారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాటని పాడారు. ప్రేమ్ రక్షిత్ డాన్స్ కోరియోగ్రఫీ చేశారు.

RRR : ఈ విజయాన్ని చరణ్‌కి మాత్రమే ట్రిబ్యూట్ చేయకండి.. చిరంజీవి!

ఇక ఆస్కార్ అందుకున్న తరువాత కీరవాణి స్టేజి పై అమెరికన్ పాప్ మ్యూజిషియన్స్ ‘కార్పెంటర్స్’ స్టైల్‌లో స్పీచ్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు. “నేను చిన్నప్పటి నుంచి కార్పెంటర్స్ మ్యూజిక్ వింటూ పెరిగాను. ఈరోజు నేను సంగీత దర్శకుడిగా ఆస్కార్ స్టేజి పై అవార్డుతో నిలుచున్నాను. There was only one wish on my mind. So Rajamouli’s and my families.. RRR has to win pride of every Indian and must put me on the top the world” అంటూ ఇంగ్లీష్ లిరిక్స్ తో పాప్ సాంగ్ స్టైల్ లో పడుతూ స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ కి వేడుకలో పాల్గొన్న ప్రపంచ తారలు అంతా ఫిదా అయ్యిపోయారు.

RRR : భారతీయులు గర్విస్తున్న క్షణాలివి.. RRR టీంకి పవన్ అభినందనలు!

అవార్డు పురస్కారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ లిరిసిస్ట్ చంద్రబోస్ తెలుగు భాష తియ్యదనాన్ని, గొప్పతనాన్ని తెలియజేశాడు. చంద్రబోస్ మాట్లాడుతూ.. తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ప్రతి అక్షరానికి ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. అలాగే ప్రతి పదం ఒక సంగీతం లాంటిది. ఒక పదాన్ని పలికితే అది సంగీతం లాగానే ఉంటుంది. ఉదాహరణకి ఒకటి చెబుతాను.. తెలుగు వారికీ ఈ సాంగ్ లోని అర్ధం తెలుసు కాబట్టి వారికీ ఈ సాంగ్ నచ్చింది. కానీ ఇతర భాషలు వారు, ఇతర దేశాలు వారు కూడా ఈ సాంగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే.. ఆ తెలుగు పదాల్లో ఉన్న సంగీతమే కారణం అంటూ తెలుగు గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు