రామ్, జానుల ప్రేమకు వంద రోజులు

మినిమం బడ్జెట్‌లో రూపొందిన 96 సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి, పలువురు టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు.

  • Published By: sekhar ,Published On : January 11, 2019 / 07:51 AM IST
రామ్, జానుల ప్రేమకు వంద రోజులు

మినిమం బడ్జెట్‌లో రూపొందిన 96 సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి, పలువురు టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు.

96.. 2018లో కోలీవుడ్‌లో వచ్చిన బ్యూటిఫుల్ లవ్ అండ్ హార్ట్ టచ్చింగ్ మూవీ.. విజయ్ సేతుపతి, త్రిషల కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమా. 2018 అక్టోబర్ 4 న రిలీజ్ అయిన 96 మూవీ, ఈ రోజుతో (2019 జనవరి 11) విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఎస్.నందగోపాల్ నిర్మాణంలో, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 96, నడివయసు గల ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే కథ.. కె.రామచంద్రన్, (రామ్)గా విజయ్ సేతుపతి, ఎస్.జానకీ దేవి, (జాను)గా త్రిష, క్యారెక్టర్స్‌లో జీవించేసారు. దర్శకుడు ప్రతీ సీన్‌నీ, ఎంతో ఇంటెన్సివ్‌గా, చక్కటి ఫీల్‌తో తెరకెక్కించాడు.

గోవింద్ వసంత కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. రిలీజ్ అయిన నెలరోజులకే 96మూవీని టీవీలో టెలికాస్ట్ చేసారు. అయినా ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూసారూ అంటే, 96 అక్కడి ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. మినిమం బడ్జెట్‌లో రూపొందిన 96, నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి, పలువురు టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు.

వాచ్ సాంగ్…