Oscar 2023 : ఆస్కార్ వేదికపైకి గాడిదని తీసుకొచ్చిన యాంకర్.. ఆ గాడిద ప్రత్యేకత ఏంటో తెలుసా??

తాజాగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో స్టేజిపైకి గాడిదని తీసుకొచ్చారు. మొదటిసారి ఆస్కార్ వేదికపై గాడిదను తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోయారు.............

A Donkey on Oscar Stage everyone surprised

Oscar 2023 :  95వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన తారలతో ఆస్కార్ వేదిక మెరిపించింది. ప్రపంచంలోనే సినిమా వాళ్లకు అత్యున్నత వేదిక అయిన ఆస్కార్ వేదిక పైకి ఎక్కాలని కోరుకొన్న కల అవార్డులు అందుకున్న వారికి నెరవేరింది.

అయితే ఆస్కార్ స్టేజిపైకి మనుషులే కాదు అప్పుడప్పుడు కొన్ని జంతువులను కూడా తీసుకొస్తారు. ఇప్పటివరకు పలు కుక్కలను, పిల్లిని ఆస్కార్ స్టేజిపైకి గతంలో తీసుకొచ్చారు. తాజాగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో స్టేజిపైకి గాడిదని తీసుకొచ్చారు. మొదటిసారి ఆస్కార్ వేదికపై గాడిదను తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిన్నటి ఆస్కార్ వేడుకల్లో యాంకరింగ్ చేసిన జిమ్మీ కిమ్మెల్ ఒక గాడిదని ఆస్కార్ వేదికపైకి తీసుకొచ్చి దాని గురించి మాట్లాడాడు.

Oscar Event : మొత్తం ఆస్కార్ వేడుకలకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? షాక్ అవ్వడం ఖాయం..

యాంకర్ జిమ్మీ కిమ్మెల్ గాడిదని తీసుకొచ్చి.. ఈమె పేరు జెన్నీ. ఈమె The Banshees of Inisherin సినిమాలో నటించిన స్టార్ అని పరిచయం చేశాడు. The Banshees of Inisherin సినిమాలో ఈ గాడిద ఓ ముఖ్య పాత్రని పోషించింది. దీంతో ఈ గాడిదని అందరికి పరిచయం చేశారు. అయితే ఆస్కార్ వేదిక పైకి ఓ గాడిదని తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక The Banshees of Inisherin సినిమా ఆస్కార్ అవార్డుల్లో 8 విభాగాల్లో నామినేట్ అయినా ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది.