Oscar Event : మొత్తం ఆస్కార్ వేడుకలకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? షాక్ అవ్వడం ఖాయం..

ఈ కార్యక్రమానికి భారీగానే ఖర్చు అవుతుంది. కానీ మనం ఊహించిన దానికంటే మరీ ఎక్కువే ఖర్చు అవుతుంది. ఒక భారీ అవార్డుల ఈవెంట్ అంటే ఏదో కొన్ని కోట్లతో అయిపోతుంది మన దగ్గర. కానీ ఆస్కార్ వేడుకల ఖర్చు ఈ సంవత్సరం దాదాపు......................

Oscar Event : మొత్తం ఆస్కార్ వేడుకలకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? షాక్ అవ్వడం ఖాయం..

Do you know how much the entire Oscar ceremony cost?

Oscar Event :  ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎదురుచూసిన అత్యున్నత అవార్డుల వేడుక ఆస్కార్ సోమవారం నాడు ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. దేశ విదేశాల నుంచి అనేక మంది సినీ ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమం కోసం అన్ని దేశాల ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.

ఇక ఈ కార్యక్రమానికి భారీగానే ఖర్చు అవుతుంది. కానీ మనం ఊహించిన దానికంటే మరీ ఎక్కువే ఖర్చు అవుతుంది. ఒక భారీ అవార్డుల ఈవెంట్ అంటే ఏదో కొన్ని కోట్లతో అయిపోతుంది మన దగ్గర. కానీ ఆస్కార్ వేడుకల ఖర్చు ఈ సంవత్సరం దాదాపు 463 కోట్లు. 95వ ఆస్కార్ వేడుకల ఖర్చు దాదాపుగా 463 కోట్లు అయినట్టు సమాచారం. ఈ సంఖ్య విని ఆశ్చర్యపోతున్నారా? కానీ దాని ఖర్చులు కూడా అలాగే ఉంటాయి.

ఒక్కో ఆస్కార్ అవార్డు తయారు చేయడానికి దాదాపు 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కాపర్ తో తయారుచేసిన ఈ అవార్డుకు బంగారు పూత పూస్తారు. ఇక అక్కడికి వచ్చే స్టార్స్ కోసం సెక్యూరిటీ, డిన్నర్, హాల్, స్టేజి, లైవ్, చాలా మంది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ .. ఇక మిగిలిన అన్ని ఈవెంట్స్ కి ఉండే కామన్ ఎరేంజ్మెంట్స్ ఉంటాయి. రెడ్ కార్పెట్ కి కూడా చాలానే ఖర్చు అవుతుంది. అయితే ఈ సారి రెడ్ కార్పెట్ కి బదులు షాంపైన్‌ రంగు కార్పెట్ వేశారు. ఈ కార్పెట్ ఖరీదు దాదాపు 20 లక్షలు. ఇక వీటితో పాటు ఆస్కార్ గెలుచుకున్న ప్రతి ఒక్కరికి ఒక కోటి ముప్పై లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇచ్చారు. ఇలా అన్ని ఖర్చులు చూసుకుంటే 463 కోట్లు అయిందట.

The Elephant Whisperers : ఆస్కార్ అందుకున్న రోజే ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులు మిస్సింగ్.. షాక్ లో చిత్రయునిట్..

అయితే ఆస్కార్ అవార్డుని ది అకాడమీ అనే సంస్థ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రత్యేకంగా నిధి ఉంటుంది. అలాగే ఆస్కార్ వేడుకల్లో ఒక 30 సెకండ్స్ యాడ్ ని ప్రదర్శించడానికి 16 కోట్లు తీసుకున్నారట. ఇలా యాడ్స్ రూపంలో, అలాగే లైవ్ స్ట్రీమింగ్ హక్కుల రూపంలో భారీగానే అకాడమీ సంస్థకు డబ్బులు వస్తాయి. అయితే ఆస్కార్ నిర్వహణకు ఏకంగా 400 కోట్లు అంటే ఆశ్చర్యపోతున్నారు అంతా. మరి ప్రపంచవ్యాప్తంగా సినిమా వాళ్ళని తీసుకొచ్చి బెస్ట్ సినిమాలకు అవార్డులు ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా చేస్తున్నప్పుడు ప్రపంచంలోనే అత్యున్నతమైన సినీ అవార్డుల వేడుకకి ఈ మాత్రం ఖర్చు అవుతుంది మరి.