Shah Rukha Khan : షారుఖ్ కు బెదిరింపు కాల్స్.. ఓ వ్యక్తి అరెస్ట్.. కానీ..

కొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.

A Man Arrested in Threaten Calls to Shah Rukh Khan Case here the Details

Shah Rukha Khan : ఇటీవల సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్ ఖాన్ ని చంపేస్తామని ఇటీవల ఓ ఫోన్ కాల్ ద్వారా బెదిరించారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఫోన్ కాల్ వచ్చిన నంబర్ తో ట్రేస్ చేసి ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లోని ఫైజాన్ ఖాన్ అనే లాయర్ ని అరెస్ట్ చేసారు. షారుఖ్ ఖాన్ కు వచ్చిన బెదిరింపు కాల్ ఫోన్ నంబర్ ఫైజాన్ ఖాన్ పేరు మీద ఉండటంతో అతనికి నోటీసులు ఇచ్చి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫైజాన్ ఖాన్ ఫోన్ పది రోజుల క్రితమే పోయిందని, దానిపై కంప్లైంట్ కూడా ఇచ్చానని పోలీస్ విచారణలో తెలిపారు.

Also Read : Mukesh Khanna : శక్తిమాన్ మళ్ళీ తిరిగొస్తున్నాడు.. లీకైన ముఖేష్ ఖన్నా వీడియో..

రెండు గంటల పాటు సాగిన పోలీస్ విచారణ తర్వాత ఫైజాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో కావాలనే నా ఫోన్ కొట్టేసి నా నంబర్ నుంచి అలా కాల్ చేసినట్టు ఉంది. నా ఫోన్ నవంబర్ 2 న పోయింది. దానిపై పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఈ విషయం పోలీస్ విచారణలో చెప్పాను అని తెలిపారు.