Omicron: ఒమిక్రాన్ గురించి 1963లోనే సినిమా.. నిజమేంటంటే

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోనూ అడుగుపెట్టింది. ఇంతవరకు మనం చూసిన వేరియంట్స్ కన్నా ఒమిక్రాన్ ఏమంత డేంజర్ కాదని చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు మాత్రం..

Omicron: దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోనూ అడుగుపెట్టింది. ఇంతవరకు మనం చూసిన వేరియంట్స్ కన్నా ఒమిక్రాన్ ఏమంత డేంజర్ కాదని చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందే. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ సినిమా 63లోనే వచ్చిందని.. ఫ్యూచర్ గురించి ముందే చెప్పేసిందని.. ప్రపంచం అంతమే అని.. ఇలా రకరకాలుగా జరుగుతున్న చర్చల్లో నిజమెంత.. అసలా సినిమాల కాన్సెప్ట్ ఏంటి?

Katrina-Vicky: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. ప్రూఫ్స్ రివీల్!

ఇండియాలోకి కొత్తగా ఎంటరైన ఒమిక్రాన్ పేరు.. 1963లోనే వినిపించింది. అయితే అదేమీ క‌రోనా వైర‌స్ కాదు.. ఒమిక్రాన్ అనే ఓ ఇటాలియ‌న్ సినిమా. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేయ‌డంతో అందరూ మర్చిపోయిన ఈ ఒమిక్రాన్‌ సినిమా మళ్లీ తెరపైకొచ్చింది. దానికి తోడు మార్ఫింగ్ పిక్చర్.. అంతకుమించిన ట్యాగ్ లైన్ తో ఆర్జీవీ భయపెట్టే పోస్ట్ చేయడంతో జనాల్లో సీరియస్ చర్చ మొదలైంది.

Actor Srikanth: లెజెండ్‌తో జగపతి.. అఖండతో శ్రీకాంత్ దశ తిరిగేనా?

కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ కు.. ఒమిక్రాన్ సినిమాకు ఏ సంబంధం లేదు. అసలీ సినిమాకు భూమి స్మశానంగా మారుతుందనే పెద్ద ట్యాగ్ లైన్ కూడా లేదు. ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న మనిషి చిన్న యాక్సిడెంట్ లో చనిపోయి.. మళ్లీ బ్రతుకుతాడు. అయితే అత‌ని శ‌రీరాన్ని ఒక ఏలియ‌న్ ఆవహించినట్టు తర్వాత తెలుస్తుంది. భూమిని ఆక్ర‌మించుకోవాల‌ని భావించిన ఒమిక్రాన్ గ్రహవాసులు ఇక్కడి ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు పంపించిన ఏలియన్ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, ఏవో సిగ్నల్స్ పాస్ చేయడం వంటివి చూపించారు. అదీ భయపెట్టే రేంజ్ లో కాదు. అందులో వైరస్ ప్రస్తావనే వినిపించదు.

Alekhya Harika: నిలువెల్లా నిషా ఎక్కించేస్తున్న దేత్తడి హారికా!

‘ఒమిక్రాన్‌’ అనే పేరు కొంచెం భయపెతుడోన్న ఈ టైంలో ఇదే పేరుతో ఉన్న మరో సినిమాపై కూడా పోస్టులు సోషల్‌ మీడియాలో ఫుల్ గా వైరల్‌ అవుతున్నాయి. ఆ సినిమా పేరు.. ది విజిటర్‌ ఫ్రం ప్లానెట్‌ ఒమిక్రాన్‌’. ఒమిక్రాన్‌ గ్రహం నుంచి వచ్చిన ఓ గ్రహాంతర వాసికి.. భూమి పైన ఓ మహిళకు ఏర్పడే ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందింది. భూమిని నాశనం చేయాలనుకునే ఒమిక్రాన్ గ్రహ వాసుల దగ్గరికే ఆమెను తీసుకెళ్లడమనే కామెడీ మూవీగా దీనిని తెరకెక్కించారు. భూమ్మీద పంటలను నాశనం చేసే వైరస్‌ను వదిలే ఏలియన్.. ఆ లేడీ తాను పెంచే మొక్కలు, వంటకాలతో.. అతడిపై విజయం సాధించడం కూడా కనిపిస్తోంది. ఇదేమీ భారీ లెవెల్ లో తీసిన సినిమా కూడా కాదు.

Chiranjeevi: ఒకేసారి మూడు సినిమాలు.. మెగాస్టార్ షటిల్ సర్వీస్!

నిజానికి ఒమిక్రాన్ అన్న పేరు మరికొన్ని కామిక్ మూవీల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ పేరు వాడిన ప్రతి ప్రాజెక్ట్ లోనూ దాన్ని మరో గ్రహానికి పేరుగానే వాడారు. అంటే ఎప్పటినుంచో ఒమిక్రాన్ అనే మరో గ్రహం ఉండొచ్చనే ఊహ ఫిల్మ్ మేకర్స్ కి ఉంది. సో ఇప్పుడు అదే పేరు కొవిడ్ వేరియంట్ కి పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇందులో జనాలు సీరియస్ గా ఆలోచించి.. ఫ్యూచర్ దబిడి దిబిడే అని ఫిక్సయిపోవాల్సిన పనిలేదు.

ట్రెండింగ్ వార్తలు