Adipurush: ఆదిపురుష్​ సినిమా రిలీజ్​పై స్టే విధించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్..

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గరనుంచి సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్​పై స్టే విధించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.

Adipurush: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గరనుంచి సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్​పై స్టే విధించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.

Adipurush 3D teaser Screening Event : ఆదిపురుష్ 3D టీజర్ స్క్రీనింగ్ ఈవెంట్ గ్యాలరీ

విడుదలైన టీజర్ లో రాముడు, హనుమంతుడు, రావణుడ్ని అసమంజసమైన ధోరణిలో చూపించారని పిటిషన్​లో ఆరోపించారు. ‘శ్రీరామాంజనేయులను’ ఇతిహాస రామాయణంలో వర్ణించినట్లుగా ఈ సినిమాలో చూపించడం లేదు. రావణుడిని చూపించిన తీరైతే మరీ అభ్యంతరకరంగా ఉంది, దీన్ని అందరూ ఖండించాలంటూ పిటిషనర్ పేర్కొన్నాడు.

శ్రీరాముడు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి. ఆదిపురష్ సినిమా టీజర్‌లో రామున్ని దారుణమైన, పగ తీర్చుకునే వ్యక్తిగా కోపంగా ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు. ఒక సన్నివేశంలో పవిత్రమైన దారానికి బదులుగా, రాముడు, హనుమంతుడు తోలు పట్టీని ధరించినట్లు చూపించబడ్డారు. రావణుడు తన నుదుటిపై ఎల్లప్పుడూ మూడు నామాలతో శివ ఆరాధకుడిగా బంగారు కిరీటం ధరించి ఉంటాడు. రామాయణంలో రావణుడు విలన్ పాత్రను కలిగి ఉన్నప్పటికీ, రావణుడు బ్రాహ్మణుడు,వేదాల పండితుడు యథార్థంగా నేర్చిన వ్యక్తి అతనిని గౌరవంగా చూపించాలి.

రాముడు, హనుమంతుని అభ్యంతరకరమైన విధంగా చిత్రీకరణ ఆపకపోతే, ప్రజలలో చాలా కోపానికి, తిరుగుబాటుకు దారితీయవచ్చు, దేశంలో శాంతిభద్రతలకు కూడా కారణం కావచ్చు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి టీజర్‌లోని అభ్యంతరకర భాగాలను తొలగించేలా చిత్ర నిర్మాత దర్శకులకు ఆదేశాలను ఇవ్వాలని కోర్టును కోరాడు పిటిషనర్.

ట్రెండింగ్ వార్తలు