Adipurush Movie : ఆదిపురుష్ రిలీజ్ చేయనివ్వం.. బుద్ధి చెప్పాల్సిందే.. మహారాష్ట్ర ఎమ్మెల్యే..

తాజాగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదిపురుష్ టీంపై విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''ఆదిపురుష్‌ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వం. సినిమా వాళ్ళు వాళ్ళ ప్రచారం కోసం మరోసారి మా దేవుళ్లు, దేవతలను.........

Adipurush Movie : ఆదిపురుష్ రిలీజ్ చేయనివ్వం.. బుద్ధి చెప్పాల్సిందే.. మహారాష్ట్ర ఎమ్మెల్యే..

 

Adipurush Movie :  ప్రభాస్ ఫ్యాన్స్ రెండేళ్లుగా ఆదిపురుష్ నుంచి అప్డేట్ కోసం ఎదురు చూశారు. ఇటీవలే ఆదిపురుష్ టీజర్ రిలీజయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించారు. అయితే టీజర్ రిలీజైన దగ్గరనించి టీజర్ పై, సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.

ఓ వైపు ప్రభాస్ అభిమానులేమో బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారని ట్రోల్ చేస్తుంటే మరో వైపు రామాయణం అని చెప్పి హాలీవుడ్ సినిమా తీశారేంటి అసలు అందులో రామాయణం ఎక్కడుంది అని హిందువులు మండిపడుతున్నారు. ఆదిపురుష్ టీజర్ పై విమర్శలు వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రతి సారి బాలీవుడ్ వాళ్లకి హిందూ మత విశ్వాసాల్ని కించపరచడం కామన్ అయిపొయింది అంటూ కొంతమంది హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.

Dil Raju : బాహుబలిని కూడా ట్రోల్ చేశారు.. ఇప్పుడు ఆదిపురుష్.. కొంతమంది కావాలని చేస్తున్నారు..

తాజాగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదిపురుష్ టీంపై విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఆదిపురుష్‌ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వం. సినిమా వాళ్ళు వాళ్ళ ప్రచారం కోసం మరోసారి మా దేవుళ్లు, దేవతలను కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరుస్తున్నారు. ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తుంటే ఎప్పటిలాగే క్షమాపణలు చెప్పడం, కొన్ని సీన్లను కత్తిరించడం చేసేసి తప్పించుకుంటున్నారు. అసలు ఇంకోసారి హిందూ దేవుళ్ళ వైపుకి రాకుండా చేయాలి, వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే సినిమా రిలీజ్ అవకుండా ఆపాలి. మహారాష్ట్రలో ఆదిపురుష్ సినిమాని రిలీజ్ చేయనివ్వం” అని సీరియస్ అయ్యారు.