35-Chinna Katha Kaadu : ’35 చిన్న కథ కాదు’ సినిమాకి అరుదైన గౌరవం..

A rare honor for 35 Chinna Katha Kaadu Movie

35-Chinna Katha Kaadu :  టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామ‌స్‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ 35 చిన్న కథ కాదు. చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. నందు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో ప్రియ‌ద‌ర్శి టీచ‌ర్ పాత్ర‌లో అల‌రించారు.

అయితే తాజగా ఈ సినిమాకి ఓ అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగనున్న ప్రముఖ ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. గోవాలోని పనాజీలో నవంబర్‌ 20 నుంచి 28 వరకు ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఇందులో 25 మూవీల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఇందుకోసం 384 సినిమాలు ఎంట్రీ చేయ‌గా తెలుగు నుంచి 35 చిన్న కథ కాదు ఎంపికైంది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. త‌మ ఆనందాన్ని పంచుకుంది.

Also Read : Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ గారికి గురుదక్షిణ ఇచ్చుకోవాలి అన్న సాయి దుర్గ తేజ్.. ఎందుకంటే..

రానా సమర్పణలో సెప్టెంబర్ 6న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన 35 చిన్న కథ కాదు సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్లు సాధించింది. ఇక ఇటీవ‌ల ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు అక్క‌డ మంచి ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నుండ‌డంలో చిత్ర బృందం ఎంతో ఖుషీగా ఉంది.