Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ గారికి గురుదక్షిణ ఇచ్చుకోవాలి అన్న సాయి దుర్గ తేజ్.. ఎందుకంటే..

Sai Durga Tej wants to give Gurudakshina to Pawan Kalyan
సాయి దుర్గ తేజ్ త్వరలోనే తన 18వ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తుంది. సుమారు 125 నుండి 150 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం సాయి తేజ్ ఫాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంపై దుర్గ తేజ్ సైతం చాలా నమ్మకంగా ఉన్నారు.
Also Read : Megastar Chiranjeevi : చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం
అయితే తాజాగా సాయి దుర్గ తేజ్ ఏబీపీ సౌత్ సమ్మిట్ లో తన బాబాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఇందులో యాంకర్ మాట్లాడుతూ.. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించడం ఎలా అనిపించింది అని అడగగా.. నిజానికి పవన్ కళ్యాణ్ గారు నా గురువు. ఆయనకి నేను గురుదక్షిణ ఇచ్చుకోవాలి. ఆయనే నన్ను ఈ ఫీల్డ్ లోకి తీసుకొచ్చింది, నాకు ఇప్పటి వరకు అన్ని నేర్పిచ్చింది ఆయనే. నేను ఎలా యాక్టింగ్ నేర్చుకోవాలి అన్నది కూడా ఆయనే నేర్పించారు. ఎక్కడికి వెళ్లి నేర్చుకోవాలి అన్నది కూడా ఆయనే చెప్పేవారు. ఆయనే నా గైడింగ్ ఫోర్స్ అంటూ సాయి దుర్గ తేజ్ తెలిపాడు. దీంతో ప్రస్తుతం సాయి దుర్గ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
He is guiding force throughout my career, always offering support. @IamSaiDharamTej about @PawanKalyan Garu#TheSouthernRisingSummit2024 pic.twitter.com/u6xQ0noTip
— Suresh PRO (@SureshPRO_) October 25, 2024
ఇకపోతే ప్రస్తుతం ఆయన నటిస్తున్న SDT18 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా 2025 లో రిలీజ్ కానుంది.