Shikaru
Shikaru: కరోనా తగ్గుముఖం పడుతుండడంతో సినీ మేకర్స్ వాళ్ళ సినిమాలకి సంబంధించి రిలీజ్లు, అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. బడా బడా స్టార్ల సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అందరూ వరసబెట్టి వాళ్ళ సినిమాల అప్డేట్స్ ఇస్తున్నారు. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, పాటలు ఏంటో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినిమాల వాళ్ళ సందడే కనిపిస్తుంది.
Tridha Choudhury: త్రిధా బికినీ ట్రీట్.. మరీ ఇంత హాటా!
సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్ లను హీరోలుగా పరిచయం చేస్తూ శ్రీమతి వాగేశ్వరి(పద్మ) సమర్పణలో శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తోన్న చిత్రం `షికారు`. హరి కొలగాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన మనసు దారి తప్పెనే పాటను మెగాహీరో వరుణ్ తేజ్ సోమవారం విడుదల చేశారు.
Shraddha Das: చీరకట్టులో చిచ్చు రేపిన శ్రద్దా!
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే..మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే.. అరే అరే అరే హాయ్ అంటే నువ్వు పెదవిపై నవ్వు ఆగనె ఆగదే..ఆగనె ఆగదే.. నీ వంటి మెరుపు చూసె వరకూ ఎంతటి అందమో ఊహకి అందలే.. అంటూ సాగే ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఇక సిద్ శ్రీరామ్ తన వాయిస్‌లోని మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేశారు. శేఖర్ చంద్ర బాణీలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.