A Theatre Screens Directly second half of Allu Arjun Puhspa 2 Movie
Pushpa 2 : ప్రస్తుతం పుష్ప 2 హవా దేశమంతా ఇంకా నడుస్తుంది. మొదటి వీకెండ్ అయినా ఇంకా థియేటర్స్ లో ప్రేక్షకులు ఫుల్ అవుతున్నారు. అయితే ఒక్కోసారి థియేటర్ మేనేజ్మెంట్ వల్ల స్క్రీనింగ్స్ లో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. తాజాగా పుష్ప 2 సినిమాకి ఓ థియేటర్లో ఫస్ట్ హాఫ్ వెయ్యకుండా ఏకంగా సెకండ్ హాఫ్ వేశారు.
గత శుక్రవారం రాత్రి కేరళ కొచ్చిలోని సినీ పాలిస్ సెంటర్ స్క్వేర్ మాల్ లో ఉన్న థియేటర్ లో సాయంత్రం 6.30 గంటల షోకి వచ్చిన ప్రేక్షకులకు థియేటర్ వాళ్ళు మర్చిపోయి మొదట సెకండ్ హాఫ్ వేశారు. అయితే ప్రేక్షకుల్లో ఎవ్వరూ సినిమా అంతకుముందు చూడలేదు కాబట్టి అదే ఫస్ట్ హాఫ్ అనుకోని చూడటం మొదలుపెట్టారు. కానీ ఇంటర్వెల్ సమయానికి ఇంటర్వెల్ పడకుండా సినిమా చివర్లో వచ్చే అందరి పేర్లు పడటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. అప్పటికి కానీ వాళ్లకు అర్ధం కాలేదు తాము చూసింది సెకండ్ హాఫ్ అని.
Also Read : Niharika Konidela : బాబోయ్.. నిహారిక బోల్డ్ రొమాంటిక్ సాంగ్ చూశారా? ఆ సినిమాలో రెచ్చిపోయిందిగా..
దీంతో ఆడియన్స్ థియేటర్ మేనేజ్మెంట్ తో డబ్బులు రీ ఫండ్ ఇవ్వాలని, ఫస్ట్ హాఫ్ వేయమని గొడవకు దిగారు. దీంతో మళ్ళీ ఫస్ట్ హాఫ్ వేస్తామని కాసేపు వెయిట్ చేయాలని కోరారు. అలాగే డబ్బులు రీ ఫండ్ ఇస్తామని ఒప్పుకున్నారు థియేటర్ మేనేజ్మెంట్. దీంతో రాత్రి 9 తర్వాత వెయిట్ చేసిన వారికి మళ్ళీ ఫస్ట్ హాఫ్ స్క్రీనింగ్ వేశారు. దీంతో ఈ ఘటన వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి పాపం ఆ ఆడియన్స్ సినిమా ఏమి అర్ధం కాక తలలు పట్టుకున్నారేమో అని అనుకుంటున్నారు.
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు రోజుల్లో 621 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సెట్ చేసింది.