Niharika Konidela : బాబోయ్.. నిహారిక బోల్డ్ రొమాంటిక్ సాంగ్ చూశారా? ఆ సినిమాలో రెచ్చిపోయిందిగా..

ఇందులో నిహారిక, షాన్ నిగమ్ మధ్య రొమాంటిక్ సీన్స్, బోల్డ్ డ్యాన్స్ ఉన్నాయి.

Niharika Konidela : బాబోయ్.. నిహారిక బోల్డ్ రొమాంటిక్ సాంగ్ చూశారా? ఆ సినిమాలో రెచ్చిపోయిందిగా..

Niharika Konidela Romantic song from Tamil Movie Madraskaaran goes Viral

Updated On : December 9, 2024 / 8:44 AM IST

Niharika Konidela : మెగా డాటర్ గా నిహారిక కొణిదెల తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలుసు. నిహారిక కూడా నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తుంది. గతంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన నిహారిక ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వేరే భాషల్లో హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తమిళ్ సినిమాల్లో నటిస్తుంది నిహారిక. తాజాగా నిహారిక నటించిన ఓ తమిళ సినిమా వీడియో సాంగ్ రిలీజయింది.

షాన్ నిగమ్ హీరోగా నిహారిక కొణిదెల, ఐశ్వర్య దుత్త హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘మద్రాస్ కారన్’. 2025 లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు. సఖి సినిమాలో మాధవన్, షాలిని మధ్య వచ్చే ‘నగిన నగిన..’ అనే రొమాంటి సాంగ్ ని రీ మిక్స్ చేసారు. ఈ పాట షాన్ నిగమ్, నిహారిక మధ్య తెరకెక్కింది.

Also See : Sobhita – Naga Chaitanya : మరిన్ని పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగచైతన్య – శోభిత.. క్యూట్ కపుల్..

తాజాగా ఈ సాంగ్ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో నిహారిక, షాన్ నిగమ్ మధ్య రొమాంటిక్ సీన్స్, బోల్డ్ డ్యాన్స్ ఉన్నాయి. నిహారిక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నిహారిక ఎప్పట్నుంచో పాత్ర కోసం ఇలాంటి బోల్డ్ చేయడానికి రెడీ అని గత సినిమాలు, సిరీస్ లలో హింట్ ఇచ్చింది. తెలుగులో మెగా డాటర్ కావడంతో ఈ రేంజ్ బోల్డ్ ఎవ్వరూ ఆఫర్ చెయ్యరు. ఇప్పుడు తమిళ్ లో ఛాన్స్ రావడంతో నిహారిక చేసింది. దీంతో ఈ పాట ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సాంగ్ లో నిహారిక పర్ఫార్మెన్స్ చూసి పలువురు అభినందిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. తెలుగులో చేస్తే ఇలాంటి విమర్శలు ఎక్కువ వస్తాయనే తమిళ్ కి వెళ్లి చేస్తుందేమో నిహారిక. ఇక సాంగ్ లోనే ఈ రేంజ్ హాట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే సినిమాలో ఎలా చేసిందో చూడాలి. మరి ఫ్యూచర్ లో నిహారిక ఇంకెన్ని సినిమాలు, సిరీస్ లలో బోల్డ్ పర్ఫార్మెన్స్ లు ఇస్తుందో చూడాలి. మీరు కూడా నిహారిక రొమాంటిక్ డ్యాన్స్ వీడియో చూసేయండి..