×
Ad

BiggBoss 6: బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి కృతి శెట్టి గురించి చెప్పాలి – సుధీర్ బాబు..

మొదటివారం ముగించుకుని రెండోవారంలో అడుగుపెట్టిన బిగ్‌బాస్-6, పదకొండో రోజు ఏడుపులతో, ఎమోషన్స్ తో హౌస్ మెంబర్స్ తో పాటు ఎపిసోడ్ చూసిన వాళ్ళని కూడా కంటతడి పెట్టించింది. ఇక శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. నేటి ఎపిసోడ్ లో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" టీం బిగ్‌బాస్ హౌస్ లో సందడి చేయనుంది.

  • Published On : September 16, 2022 / 04:57 PM IST

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Team in BiggBoss House

BiggBoss 6: మొదటివారం ముగించుకుని రెండోవారంలో అడుగుపెట్టిన బిగ్‌బాస్-6, పదకొండో రోజు ఏడుపులతో, ఎమోషన్స్ తో హౌస్ మెంబర్స్ తో పాటు ఎపిసోడ్ చూసిన వాళ్ళని కూడా కంటతడి పెట్టించింది. బిగ్‌బాస్ బేబీ టాస్క్ ఇవ్వడంతో.. ‘బేబీ’కి రిలేటెడ్ గా జరిగిన ఒక బాధాకరమైన సన్నివేశాన్ని కంటెస్టెంట్స్ గుర్తుకు చేసుకోవడంతో గురువారం పూర్తి ఎమోషనల్ గా నడిచింది.

Aa Ammayi Gurinchi Meeku Cheppali: “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.. సినిమా కాదు షార్ట్ సిరీస్ అంటున్న మూవీ మేకర్స్!

ఇక శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. నేటి ఎపిసోడ్ లో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీం బిగ్‌బాస్ హౌస్ లో సందడి చేయనుంది. ఈ సినిమాలో నటించిన హీరో సుధీర్ బాబు, అందాల భామ కృతి శెట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్‌బాస్ హౌస్ మేట్స్ తో కలిసి నేడు బుల్లితెరపై సందడి చేయనున్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తుండగా, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ తో సినిమా ఆడిషన్స్ టాస్క్ చేశారు. హౌస్ మేట్స్ కొన్ని హిట్ సినిమాలోని డైలాగ్స్ అండ్ సీన్స్ ని రీ-క్రియేట్ చేసి హౌస్ మొత్తం నవ్వులు పూయించారు. కంటెస్టెంట్ శ్రీసత్య అయితే ఇవాళ్టి ఎపిసోడ్ లో ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్‌టెయిన్ చేయనుంది. ఇక ఈ ఆడిషన్ లో హీరో సుధీర్ ఎవరని సెలెక్ట్ చేసాడో తెలియాలి అంటే మొత్తం ఎపిసోడ్ చూడాల్సిందే.