Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుధీర్ బాబు సినిమా కోసం తరలివస్తున్న టాలీవుడ్.. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ప్రీ రిలీజ్ ఈవెంట్!

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో యంగ్ హీరో సుధీర్ బాబు చేస్తున్న మూడో చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా, మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులు, హీరోలు హాజరు కానున్నారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event Guests

Aa Ammayi Gurinchi Meeku Cheppali: దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో యంగ్ హీరో సుధీర్ బాబు చేస్తున్న మూడో చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలు మంచి విజయం సాధించడంతో. ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్.. బొమ్మ హిట్టు!

టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఒకే హీరోతో కలిసి మూడు వరుస సినిమాలు చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా, మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులు, హీరోలు హాజరు కానున్నారు.

హీరోలు.. నాగచైతన్య, అడవి శేషు, సిద్దు జొన్నలగడ్డ హాజరు కానుండగా, దర్శకులు.. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, పరుశురాం, వెంకీ కుడుముల, రాహుల్ సాంకృత్యాన్ వేడుకకు రానున్నారు. దీనికి సంబంధించి మూవీ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబుకి జంటగా కృతి శెట్టి నటిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.