Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్.. బొమ్మ హిట్టు!

టాలీవుడ్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసే హీరోగా సుధీర్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యం ఎక్కడ ఉంటే, అక్కడ సినిమా చేసేందుకు రెడీగా ఉంటాడు ఈ హీరో. అందుకే సుధీర్ బాబు చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ అని చిత్ర వర్గాల్లోనూ ఓ నమ్మకం ఏర్పడింది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్.. బొమ్మ హిట్టు!

Sudheer Babu Krithi Shetty Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer

Sudheer Babu: టాలీవుడ్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసే హీరోగా సుధీర్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యం ఎక్కడ ఉంటే, అక్కడ సినిమా చేసేందుకు రెడీగా ఉంటాడు ఈ హీరో. అందుకే సుధీర్ బాబు చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ అని చిత్ర వర్గాల్లోనూ ఓ నమ్మకం ఏర్పడింది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు..

ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతోంది. మంచి ఫీల్ గుడ్ కంటెంట్‌తో ఈ ట్రైలర్‌ను నింపేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా, ఈ సినిమాలో ఆయన ఓ డైరెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఓ డాక్టర్‌ను హీరోయిన్‌గా మార్చేందుకు సుధీర్ బాబు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. ఇంతకీ తాను అనుకున్న అమ్మాయితో హీరోయిన్ పాత్రను ఎలా వేయించాడు.. అనేది మనకు సినిమా కథగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Sudheer Babu: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటున్న మహేష్ బాబు..

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కృతి శెట్టి నటిస్తోండగా, ఆమెది మంచి ఎమోషనల్ పాత్రగా చిత్ర యూనిట్ డిజైన్ చేసింది. ఈ సినిమాలో సుధీర్ బాబు, కృతి శెట్టి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.