Updated On - 4:56 pm, Mon, 1 March 21
Aa Ammayi Gurinchi Meeku Cheppali: యంగ్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో మాంచి స్పీడుమీదున్నాడు.. ఇటీవలే ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘యాత్ర’ నిర్మాతలు నిర్మిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రకటించాడు.
సుధీర్ బాబు- విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. సుధీర్ బాబు, ‘ఉప్పెన’ తో బేబమ్మగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి జంటగా.. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో, బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి కలిసి నిర్మిస్తున్నారు.
సోమవారం ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇంద్రగంటి మార్క్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే అందమైన పేరు ఖరారు చేశారు. ఈ సినిమాకి కెమెరా : పిజి విందా, సంగీతం : వివేక్ సాగర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ : సాహి సురేష్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్.
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..
Uppena Actors : ఖమ్మంలో బేబమ్మ-ఆర్సీల సందడి.. ఉప్పెనలా ఎగబడిన జనం
Uppena : లాక్డౌన్ తర్వాత 50 రోజుల పోస్టర్ పడిన సినిమా ‘ఉప్పెన’..
Tollywood : టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ : సినిమాల విడుదలపై ఎఫెక్ట్