అమీర్ ఖాన్‌తో మెగాస్టార్ చిరంజీవి

  • Publish Date - April 7, 2019 / 07:51 AM IST

ఎవరైనా స్టార్ మీకు ఎదురు పడితే ఏం చేస్తారు ? అబ్బా అంతకంటే అదృష్టం ఉంటుందా..సెల్ఫీ లేకపోతే..ఓ ఆటోగ్రాఫ్..ఓ ఫొటో తీసుకుని ఈ విషయాన్ని వెంటనే ఫేస్ బుక్..ట్విట్టర్..ఏదో ఒక దానిలో పోస్టు చేస్తాం..అంటారు కదా..కరెక్ట్..ఇలాగే బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ‘అమీర్ ఖాన్’ చేశాడు. ఆయనకు ఎదురు పడింది ఎవరో కాదు..టాలీవుడ్ మెగాస్టార్ ‘చిరంజీవి’. చిరంజీవి..అమీర్ ఖాన్‌ల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది తెలుసుకోవాలంటే ఇది చదవండి..

చిరంజీవి దంపతులు ఇటీవలే జపాన్‌కు వెళ్లారు. తిరిగి వీరు హైదరాబాద్‌కు వస్తున్నారు. ‘క్యోటో’ విమానాశ్రయంలో చిరు దంపతులు దిగారు. అక్కడనే ‘అమీర్ ఖాన్’ కూడా ఉన్నారు.
చిరును చూసిన అమీర్ వెంటనే ఆయన దగ్గరకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘తన అభిమాన నటుడు చిరంజీవి గారు కనిపించగానే ఆశ్చర్యపోయాను..వెంటనే పరుగెత్తి ఆయన దగ్గరకు వెళ్లా. మెగాస్టార్‌ను కలవాల్సి వస్తుందని అసలు ఊహించలేదు’ అని తెలిపాడు అమీర్. ‘ఉయ్యాలవాడ..’ గురించి అడిగి తెలుసుకున్నా..మీరు మాకు ఎప్పుడూ ప్రేరణగానే ఉంటారు’ అంటూ అమీర్ ట్వీట్‌లో తెలిపారు. 

కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న చిరు..150వ సినిమా..‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 151వ సినిమా ‘సైరా’..ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చిత్రంలో చిరంజీవి నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ తేజ భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి ‘అమితాబ్ బచ్చన’ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేగాకుండా ఇతర వుడ్‌ల హీరోలు సైతం నటిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన సినిమా షూటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.