Aamir Khan : సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్.. ఆ వీడియో విషయంలో..

ఎన్నికల సమయం నడుస్తుండటంతో అమీర్ ఖాన్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్నట్టు నిన్నటి నుంచి ఓ వీడియో వైరల్ అవుతుంది.

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత సినిమా లాల్ సింగ్ చద్దా దారుణ పరాజయం పాలవడంతో కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ తీసుకుంటానని ప్రకటించాడు. ప్రస్తుతం నటుడిగా సినిమాలకు దూరంగా ఉన్నా నిర్మాతగా పలు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే కూతురు పెళ్లి కూడా చేసాడు అమీర్. తాజాగా అమీర్ ఖాన్ వైరల్ అవుతున్నారు.

ఎన్నికల సమయం నడుస్తుండటంతో అమీర్ ఖాన్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్నట్టు నిన్నటి నుంచి ఓ వీడియో వైరల్ అవుతుంది. దీంతో అమీర్ ఖాన్ టీం దీనిపై స్పందించారు. అమీర్ ఖాన్ తన కెరీర్ లో ఎప్పుడూ ఏ పార్టీకి ప్రచారం చేయలేదు, ఏ పార్టీ తరపున నిలబడలేదు. కేవలం ఎలక్షన్ కమిషన్ కోసం ఓటు వేయండి అని మాత్రం ప్రచారం చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఫేక్ వీడియో. అది AI జనరేటెడ్ వీడియో అని తెలుస్తుంది. ఆల్రెడీ దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు అమీర్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ఆ వీడియో జనరేట్ చేసి ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ టీం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Also Read : HariHara VeeraMallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ శ్రీరామనవమి స్పెషల్ అప్డేట్.. ధర్మం కోసం యుద్ధం అంటూ..

దీంతో ముంబై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆ వీడియో చేసిన వారిని వెతికే పనిలో ఉంది. అమీర్ అభిమానులు కూడా అమీర్ కి మద్దతుగా ఆ వీడియోని షేర్ చేస్తూ ఇది ఫేక్ వీడియో, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసారని తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు