HariHara VeeraMallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ శ్రీరామనవమి స్పెషల్ అప్డేట్.. ధర్మం కోసం యుద్ధం అంటూ..
తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా పవన్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఓ అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Sri Rama Navami Special Update and Poster
HariHara VeeraMallu Update : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉండటంతో చేతిలో ఉన్న మూడు సినిమాలు పక్కన పెట్టేసారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా అంటూ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి.
ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. కానీ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, షూటింగ్ మొదలుపెట్టి ఆపేయడం, మూడేళ్లయినా సినిమా షూట్ కూడా పూర్తికాకపోవడంతో పవన్ అభిమానులు అసలు ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం మూవీ యూనిట్ హరిహర వీరమల్లు సినిమా ఉందని, త్వరలోనే అప్డేట్స్ వస్తాయని, గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్తూ ఓ ట్వీట్ చేసింది.
Also Read : CM Eknath Shinde : స్టార్ హీరోని కలిసిన సీఎం.. ఎన్నికల ముందు కలిసొస్తుందా?
తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా పవన్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఓ అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో.. కత్తి పట్టుకొని పవన్ పవర్ ఫుల్ కళ్ళతో చూస్తున్నట్టు ఉంది. దీనిపై మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో అని రాయడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ త్వరలోనే టీజర్ రానుంది అని పోస్ట్ చేశారు. ఇలా ఎలాంటి అప్డేట్ లేకుండా సడెన్ గా హరిహర వీరమల్లు మూవీ నుంచి పోస్టర్ రావడంతో సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు ట్రెండ్ అవుతుంది. పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… ?
మీ ముందుకు… ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! #HariHaraVeeraMallu Teaser Out Soon! ?@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes pic.twitter.com/gqopvkFtWb
— Mega Surya Production (@MegaSuryaProd) April 17, 2024