CM Eknath Shinde : స్టార్ హీరోని కలిసిన సీఎం.. ఎన్నికల ముందు కలిసొస్తుందా?

తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు.

CM Eknath Shinde : స్టార్ హీరోని కలిసిన సీఎం.. ఎన్నికల ముందు కలిసొస్తుందా?

Maharashtra CM Eknath Shinde meets Salman Khan and his dad Salim Khan in Salman House

CM Eknath Shinde – Salman Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాల్పులు జరిపిన వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ పై దాడులు చేస్తామని పలువురు గ్యాంగ్ స్టర్స్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ కి ప్రభుత్వం భద్రత ఇచ్చింది. సల్మాన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుక్కున్నాడు.

కానీ తాజాగా ఈ కాల్పుల ఘటనతో మరోసారి సల్మాన్ ఖాన్ చర్చగా మారారు. సల్మాన్ ఫ్యాన్స్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో సల్మాన్ ఇంటి ముందు మరింత భద్రత పెంచారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. కాల్పుల సంఘటన గురించి మాట్లాడి సల్మాన్ కి సంఘీభావం తెలిపారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ ని కూడా కలిసి మాట్లాడారు ఏక్ నాథ్ షిండే. ఆల్రెడీ భద్రత ఏర్పాటు చేశామని, ఈ విషయంలో అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటామని, మీ భద్రత మాది అని సీఎం షిండే సల్మాన్ కి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Also Read : Rakul Preet Singh : హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రెస్టారెంట్ బిజినెస్.. ఏ రెస్టారెంట్..? మీరు కూడా వెళ్లి ఫుడ్ ట్రై చేస్తారా?

సల్మాన్ ని కలిసిన అనంతరం ఏ నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఆల్రెడీ విచారణ జరుగుతుందని, సల్మాన్ ఖాన్ కి పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం షిండే సల్మాన్ ఇంటికి వెళ్లి మరీ కలిసి మాట్లాడటంతో ఎన్నికల్లో కూడా కలిసొస్తుందని, సల్మాన్ ఫ్యాన్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.