Aamir Khan : చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమీర్ ఖాన్.. ఫోటోలు వైరల్..

చెన్నై వరదల్లో తమిళ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరో కూడా చిక్కుకున్నారు.

Aamir Khan : మిగ్‌జామ్ తుపాను చెన్నై నగరాన్ని వణికిస్తోంది. భారీ వరదనీరుతో చెన్నై నగరం అతలాకుతలం అయ్యిపోతుంది. రోడ్డులు, ఇల్లు వరదనీరుతో నిండిపోయి జన జీవనాన్ని స్తంభించేస్తుంది. ఈ వరద బీభత్సంతో సాధారణ ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరెంటు పోవడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, ఇళ్లలోకి వరద నీరు కొట్టుకురావడంతో.. కోలీవుడ్ స్టార్ హీరోలు సైతం సహాయం కోసం అర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు హీరోలు గవర్నమెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వరదల్లో తమిళ్ హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ హీరో కూడా చిక్కుకున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తమిళ్ హీరో విష్ణు విశాల్ ఈ ఫోటోలను షేర్ చేశారు. తమని రక్షించిన రక్షక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. ఇక విష్ణు విశాల్ షేర్ చేసిన ఫొటోల్లో ఆమీర్ ఖాన్ కూడా కనిపిస్తున్నారు.

Also read : Prabhas : గతంలో గురువుకి గోల్డ్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూశారా..?

కాగా ఆమీర్ ఖాన్ గత కొని రోజుల నుంచి చెన్నైలోనే ఉంటున్నారట. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఆమీర్.. అప్పటి నుంచి చెన్నైలో ఉంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమీర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. కొన్నాళ్ళు యాక్టింగ్ బ్రేక్ చెప్పి ఫ్యామిలీతో హ్యాపీ టైం స్పెండ్ చేస్తున్నారు. చివరిగా లాల్ సింగ్ చద్దా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి ఆమీర్ తన రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారో చూడాలి. కాగా వచ్చే నెల 2024 జనవరి 3న ఆమీర్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి జరగనుంది. ఐరా ప్రేమించిన నుపుర్ శిఖరేతోనే కూతురు పెళ్లి చేస్తున్నారు ఆమీర్ ఖాన్.

 

ట్రెండింగ్ వార్తలు