Prabhas : గతంలో గురువుకి గోల్డ్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూశారా..?
తనకి నటనలో తనకి అక్షరాలు నేర్పిన గురువుకి పుట్టినరోజు బహుమతిగా ప్రభాస్ బంగారు కనుక అందజేశారు.

Prabhas gifted gold watch to his acting master Satyanand
Prabhas : డార్లింగ్ ప్రభాస్ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా స్థాయికి ఎదిగినా తనకంటే పెద్దవారి నుంచి చిన్నవారి వరకు ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమగా ఒదిగి మాట్లాడతారు. అందుకనే ప్రతిఒక్కరు ఆయనని డార్లింగ్ అని పిలుచుకుంటుంటారు. కాగా రీసెంట్ గా ప్రభాస్ తన గురువు సత్యానంద్ కి బర్త్ డే గిఫ్ట్ అందజేశారు. ప్రభాస్, సత్యానంద్ స్కూల్ లోనే యాక్టింగ్ నేర్చుకున్నారు. ఇక నటనలో తనకి అక్షరాలు నేర్పిన గురువుకి పుట్టినరోజు బహుమతిగా ప్రభాస్ బంగారు కనుక అందజేశారు.
ఆ బర్త్ డే గిఫ్ట్ ని స్వయంగా ప్రభాస్ తన గురువుకి అందజేశారు. ఆ గోల్డ్ వాచ్ కొనడానికి చాలా కష్టపడినట్లు, ఆయనకి వైట్ కలర్ అంటే ఇష్టమని తెలుసుకొని.. ఆ కలర్ వాచ్ నే కొన్నట్లు చెప్పుకొచ్చారు. వాచ్ ఇచ్చిన తరువాత నచ్చిందా లేదా అని గురువుని అడిగి తెలుసుకున్నారు ప్రభాస్. ఆయన చాలా బాగుందని చెప్పుకొచ్చారు. అలాగే ఆ వాచ్ చైన్ నార్మల్‌ది అనుకోని పడేస్తారేమో, అది గోల్డ్ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ చైన్ టైట్ అనిపిస్తే.. షాప్ కి వెళ్తే ఇంకో బిట్ యాడ్ చేసి ఇస్తారని ప్రభాస్ తెలియజేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో 2021 బర్త్ డేకి సంబంధించింది. అప్పుడు కేవలం ఫోటోలు మాత్రమే బాగా వైరల్ అయ్యాయి. వాచ్ గిఫ్ట్ ఇచ్చినట్లు, వీడియో బయటకి రాలేదు. ఇప్పుడు ఈ వీడియో బయటకి వచ్చి నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Jersey : జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట.. ఆయన కోసం రాసిన కథని నాని..
View this post on Instagram
ఇక సలార్ మూవీ విషయానికి వస్తే.. ఇటీవల ఈ మూవీ నుంచి ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఆడియన్స్ ని ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. అయితే మరికొన్ని రోజుల్లో మరో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు పై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది.