Aashiqui Aa Gayi : మైండ్ బ్లోయింగ్ మెలోడీ… ప్రభాస్ కెరీర్‌లో చూసి ఉండరు..
‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ‘ఆషికీ ఆగయి’ ప్రోమో చూశారా..
- sekhar
- Published On : November 29, 2021 / 01:42 PM IST
Aashiqui Aa Gayi
Aashiqui Aa Gayi: డార్లింగ్ ప్రభాస్‌ని ఆడియన్స్ కొంత గ్యాప్ తర్వాత లవర్ బాయ్ క్యారెక్టర్‌లో చూడబోతున్నారు. ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’.
Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో
1970’s కాలంలో యూరప్‌లో జరిగే పీరియాడిక్ సై-ఫై రొమాంటిక్ డ్రామాగా భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలకి, ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్‌కి చాలా చక్కటి స్పందన వచ్చింది. సోమవారం ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో (హిందీ వెర్షన్) ‘ఆషికీ ఆ గయి’ విడుదల చేశారు.
Radhe Shyam : చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రభాస్.. ప్లాన్ అదిరిందిగా!
ప్రభాస్, పూజాల పెయిర్ చాలా చాలా బాగుంది. లిరికల్‌గానూ విజువల్‌గానూ సాంగ్ అదిరిపోతుంది అన్నట్లు హింట్ ఇచ్చింది ప్రోమో. హిందీ వెర్షన్‌కి మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అర్జిత్ సింగ్ చాలా చక్కగా పాడారు. సాయంత్రం 7 గంటలకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో రిలీజ్ కానుంది. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ రాబోతోంది.
