ట్రైలర్ అదిరింది!

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా.. ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్న మూవీ, ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ).. డి.సురేష్ బాబు సమర్పిస్తుండగా, సంజీవ్ రెడ్డి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అండ్ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. రీసెంట్‌గా ఏబీసీడీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. ఈ సందర్భంగా ఏబీసీడీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేసారు.
టీజర్, ట్రైలర్‌కి ఏమాత్రం తగ్గలేదీ రిలీజ్ ట్రైలర్.. ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో, ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేద్దామని శిరీష్, భరత్ అమెరికా నుండి ఇండియా రావడం, ఇక్కడ ఇరుక్కు పోవడం, ఇక్కడి పరిస్థితును అలవాటు చేసుకోవడం వంటివి ఫన్నీ యాంగిల్‌లో చూపించారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. శిరీష్ అండ్ భరత్ ఆడియన్స్‌ని ఫుల్‌గా నవ్వించబోతున్నారని హింట్ ఇచ్చింది. శిరీష్, రుక్సార్ పెయిర్ బాగుంది. ఏబీసీడీ మే 17 న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
నాగబాబు, శుభలేఖ సుధాకర్, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి, సంగీతం : జుదా శాండీ, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : కళ్యాణ్ రాఘవ్, లిరిక్స్ : భాస్కరభట్ల, కెకె, తిరుపతి, ఆర్ట్ : పిఎస్ వర్మ, కొరియోగ్రఫీ : విజయ్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని.
వాచ్ ట్రైలర్..