Abhinav Gomatam new movie Masthu Shades Unnay Ra in lead role
Masthu Shades Unnay Ra : ప్రస్తుతం టాలీవుడ్ లోని పలువురు యంగ్ కమెడియన్స్ కూడా హీరోగా నటిస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈక్రమంలోనే మరో కమెడియన్ ‘అభినవ్ గోమఠం’ కూడా రాబోతున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో కౌశిక్ పాత్రలో నటించి అందర్నీ నవ్వించాడు. ఇక ఈ చిత్రంలో అభినవ్ చెప్పిన కొన్ని డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అలా వైరల్ అయిన ఓ డైలాగ్ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో’.
ఇప్పుడు ఈ డైలాగ్ తోనే అభినవ్.. హీరోగా తన మొదటి సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ అనే టైటిల్ తో తన కొత్త మూవీని అనౌన్స్ చేశారు. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. వైశాలి రాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ పతిష్ట సందర్భంగా ఈ మూవీ లోగోని రిలీజ్ చేశారు.
Also read : Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ మోకాలికి గాయం.. ‘దేవర’ షూటింగ్‌లో జరిగిందేనా..!
లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఫిబ్రవరి మూడు నాలుగు వారాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. తరుణ్‌భాస్కర్, అలీ రేజా, రవీందర్ రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, సాయిక్రిష్ణ, ఫణి చంద్రశేఖర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సంజీవ్ టి, శ్యాముల్ అబే సంగీతం అందిస్తున్నారు.
కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, వి ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిమేర-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి మంచి పేరు సంపాదించుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి కమెడియన్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్న అభినవ్ గోమఠం.. హీరోగా కూడా సక్సెస్ అవుతారేమో చూడాలి.