Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ మోకాలికి గాయం.. ‘దేవర’ షూటింగ్‌లో జరిగిందేనా..!
సైఫ్ అలీఖాన్ మోకాలికి, భుజాలకి గాయం. నేడు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సైఫ్..

Saif Ali Khan Hospitalised In Mumbai With a Fractured Knee And Shoulder
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ మోకాలికి, భుజాలకి గాయం జరిగినట్లు సమాచారం. దీంతో ఆయన సర్జరీ కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు తెలుస్తుంది. కాగా సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే.. సైఫ్ అలీఖాన్ కి గాయాలు దేవర సెట్స్ లోనే జరిగాయా..? అనే సందేహం కలుగుతుంది. అయితే సైఫ్ టీం నుంచి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో నేడు జనవరి 22న అడ్మిట్ అయ్యినట్లు బాలీవుడ్ మీడియా తెలియజేస్తుంది.
Also read : HanuMan : సీక్వెల్‌లో స్టార్ హీరో కోసమే.. మూవీలో ‘హనుమాన్’ ఫేస్ చూపించలేదు..
View this post on Instagram
ఇక ఈ వార్త తెలుసుకున్న సైఫ్ అలీఖాన్ అభిమానులు.. తాను త్వరగా కోలుకొని తిరిగి రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా రావణాసురుడిగా నటించి తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. ఇప్పుడు దేవరతో టాలీవుడ్ కి డెబ్యూట్ ఇవ్వబోతున్నారు. కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చితం రెండు భాగాలుగా రూపొందుతుంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.