HanuMan : సీక్వెల్‌లో స్టార్ హీరో కోసమే.. మూవీలో ‘హనుమాన్’ ఫేస్ చూపించలేదు..
సీక్వెల్‌లో స్టార్ హీరో కోసమే మూవీలో 'హనుమాన్' ఫేస్ చూపించలేదంటూ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

Prashanth Varma said Tollywood star hero will play lead role in Jai Hanuman
HanuMan : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ‘హనుమాన్’ సినిమాని.. ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 200 కోట్ల గ్రాస్ ని కూడా దాటేసి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని హనుమాన్ ఎండింగ్ లోనే తెలియజేశారు.
దీంతో ఆడియన్స్ అంతా ఆ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది..? అందులో హీరోగా ఎవరు కనిపించబోతున్నారు..? అలాగే ఆ మూవీ కథ ఎలా ఉండబోతుంది..? అనే సందేహాలు ప్రశ్నలుగా మిగిలాయి. తాజాగా వీటిపై ప్రశాంత్ వర్మ రియాక్ట్ అయ్యారు. ఒక బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. “మూవీలో హనుమంతుడి ఫేస్ ని ఎందుకని పూర్తిగా రివీల్ చేయలేదని” అని ప్రశ్నించారు.
Also read : HanuMan : రామ మందిరం ప్రారంభోత్సవం నాడు.. హనుమాన్ మూవీ సంచలనం..
ఇక దీనికి ప్రశాంత్ వర్మ బదులిస్తూ.. “జై హనుమాన్ కథ అంతా హనుమాన్ పాత్రతోనే సాగుతుంది. ఆ పాత్రలో ఎవరని చూపించాలని ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీలో ఓ ఫేస్ చూపించి, సీక్వెల్ లో మరో ఫేస్ చూపిస్తే బాగోదని మొఖాన్ని రివీల్ చేయలేదు. జై హనుమాన్ లో ఆంజనేయ స్వామి పాత్రని టాలీవుడ్ స్టార్ హీరోనే చేస్తారు. ఇక ఈ సీక్వెల్ లో తేజ సజ్జ హనుమంతు పాత్రతోనే సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తాడు” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడుతూ.. “నెక్స్ట్ దేవతల రాజు ఇంద్రుడు పవర్స్ తో ‘ఆధీర’ రాబోతుంది. జై హనుమాన్ 2025 లో వస్తుంది. ఆ తరువాత ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ‘మహాకాళి’ రాబోతుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సూపర్ హీరో పాత్రల్లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇతర పరిశ్రమలోని స్టార్స్ కూడా కనిపించబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.