Abhiram : డైరెక్టర్ తేజ అందరి ముందు తిట్టాడు.. షూటింగ్ లో గాయపడి ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నా..

తేజ దర్శకత్వంలో అభిరామ్ అహింస(Ahimsa) సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అవ్వబోతున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న విడుదల కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Abhiram : డైరెక్టర్ తేజ అందరి ముందు తిట్టాడు.. షూటింగ్ లో గాయపడి ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నా..

Abhiram Daggubati comments on Director Teja in Ahimsa Movie Promotions

Updated On : May 28, 2023 / 8:24 AM IST

Ahimsa :  రానా(Rana) దగ్గుబాటి తమ్ముడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh Babu) రెండో తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో అభిరామ్ అహింస(Ahimsa) సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అవ్వబోతున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న విడుదల కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అభిరామ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ లో జరిగిన విషయాలను పంచుకున్నాడు.

NTR rare photos : ఎన్టీఆర్ శత జయంతి వేళ.. ఎన్టీఆర్ రేర్ ఫొటోస్.. ఈ ఫొటోలను చూశారా?

అభిరామ్ మాట్లాడుతూ.. సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ని ఎత్తుకొని పరిగెత్తాలి. ఆ సీన్ లో నేను కింద పడిపోయాను. మోకాళ్ళకు బాగా దెబ్బ తగిలింది. దీంతో నేను ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అని తెలిపాడు. అలాగే డైరెక్టర్ తేజ సెట్ లో అందరి ముందు తిట్టేవాడు. తేజ గురించి చాలా స్ట్రిక్ట్ అని విన్నాను, షూట్ లో డైరెక్ట్ గా చూశాను. ఓ సారి అయితే మైక్ లో అరుస్తూ.. నీ బ్యాక్ గ్రౌండ్ నాకు సంబంధం లేదు, నేను ఆడియన్స్ కోసం సినిమా తీస్తున్నాను. కాబట్టి ఫోకస్ పెట్టి నటించు అని అందరి ముందు అన్నట్టు తెలిపాడు అభిరామ్. మరి అహింస సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.