Abhiram Daggubatti- దగ్గుబాటి వారసుడుతో తేజ సినిమా.. అహింస!
దగ్గుబాటి వారసుడు, నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

Abhiram Daggubati Debut Film With Director Teja
Abhiram Daggubatti: దగ్గుబాటి వారసుడు, నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దగ్గుబాటి కుటుంబం నుంచి ఇప్పటికే వెంకటేష్, రానా సినిమా రంగంలో హీరోలుగా రాణిస్తుండగా.. అభిరామ్ దర్శకుడు తేజ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సింపుల్‌గా జరిగిపోయి సినిమా స్టార్ట్ అయిపోయింది. దర్శకుడు తేజ ఎన్టీఆర్ బావమరిదిని లాంచ్ చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు రాగా.. ఇప్పుడు అభిరామ్‌తో సినిమా సెట్స్‌పైకి వచ్చేసింది.
తేజ డైరెక్షన్‌లో ఇప్పటికే రానా నేనే రాజు నేనే మంత్రి వంటి పక్కా కమర్షియల్ సినిమాను రూపొందించగా.. ఇప్పుడు అభిరామ్‌తో లవ్ స్టోరీ చేస్తున్నట్లు టాక్. తేజ-సురేష్ ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అహింస అనే టైటిట్ పెట్టారట.
ఈ సినిమాలో అభిరామ్ సరసన కృతిసనన్ చెల్లెలు నుపూర్ సనన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ఫేమస్ అయిన నుపూర్ సనన్ ఇండస్ట్రీలోకి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుందో? లేదో? చూడాలి.