Abhishek Bachchan Buys Six luxury Apartments In Mumbai
Abhishek Bachchan – luxury Apartments : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్. పలు విభిన్న చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. మాజీ విశ్వసుందరి, నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ వివాహం చేసుకున్నాడు. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్ పేరు మారుమోగిపోతుంది. ఇందుకు కారణం ముంబైలోని బొరివాలి సబర్చన్ ప్రాంతంలో
అతడు ఒకేసారి ఆరు అపార్టుమెంట్లను కొనుగోలు చేయడమే.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఒబేరాయ్ రియాల్టీ అనుబంధ సంస్థ ‘ఇంక్లైన్ రియాల్టీ’ వద్ద అభిషేక్ ఈ ఆరు అపార్టుమెంట్లను కొన్నాడు. వీటి విలువ అక్షరాలా రూ.15.42 కోట్లు.
Naga Chaitanya : ఇదెక్కడి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రా బాబు.. శ్రీకాకుళంలో నాగ చైతన్య ఫ్యాన్స్ హవా..
ఒబేరాయ్ స్కై సిటీ అనే లగ్జరీ ప్రాజెక్టును ఇంక్లైన్ రియాల్టీ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో 57వ అంతస్తులోని ఆరు అపార్టుమెంట్లను అభిషేక్ తీసుకున్నాడు. వీటి విస్తీర్ణం 4,984 చదరపు అడుగులు. అంటే ఒక్కో చదరపు అడుగు ధర రూ.31,498. ఇందులో రెండు అపార్టుమెంట్లు 252 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే మిగతా నాలుగు.. ఒక్కొక్కటి సుమారు 1100 చదరపు అడుగుల కార్పేట్ ఏరియా కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.
రూ.79లక్షల చొప్పున రెండు చిన్న అపార్టుమెంట్లను కొనుగోలు చేయగా.. మిగిలిన నాలుగు పెద్ద అపార్టుమెంట్లకు ఒక్కొ దానికి దాదాపు రూ.3.5 కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ ప్రక్రియ గత నెల 28న పూర్తి కాగా.. 29న రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని జాప్‌కీడాట్ కామ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
కాగా.. ఈ వార్తపై అటు అభిషేక్ బచ్చన్ గానీ, ఇటు రియల్ ఎస్టేట్ సంస్థ గానీ స్పందించలేదవు.