Naga Chaitanya : ఇదెక్కడి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రా బాబు.. శ్రీకాకుళంలో నాగ చైతన్య ఫ్యాన్స్ హవా..

నాగచైతన్య, సాయి పల్లవి శ్రీకాకుళం వెళ్లగా అక్కడ అక్కినేని ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చి నాగ చైతన్యకు స్వాగతం పలికారు.

Naga Chaitanya : ఇదెక్కడి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రా బాబు.. శ్రీకాకుళంలో నాగ చైతన్య ఫ్యాన్స్ హవా..

Srikakulam Akkineni Fans Welcomed Naga Chaitanya with Huge Celebrations

Updated On : June 19, 2024 / 2:55 PM IST

Naga Chaitanya : నాగ చైతన్య వరుస సినిమాలతో మెప్పిస్తున్నాడు. అక్కినేని అభిమానులు అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు వస్తే చేసే సందడి అంతా ఇంత కాదు. నాగ చైతన్య కూడా అక్కినేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏ మాత్రం నిరాశపరచకుండా ఆ లెగసీని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. గీత ఆర్ట్స్ నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తండేల్ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Helen Richardson : 85 ఏళ్ళ వయసులో జిమ్‌లో కష్టపడుతున్న నటి.. ఈ ఏజ్‌లో ఇంత ఫిట్‌గా..

సముద్ర జలాల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో తండేల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుల కథతో రాసుకున్నారు. దీంతో మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో కూడా చేస్తున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ కి నాగచైతన్య, సాయి పల్లవి శ్రీకాకుళం వెళ్లగా అక్కడ అక్కినేని ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చి నాగ చైతన్యకు స్వాగతం పలికారు.

 

అక్కినేని అభిమానులు బైక్ ర్యాలీ చేస్తూ, చైతన్యకు గజమాల వేసి, తండేల్ జెండాలు పట్టుకొని, జై చైతూ అంటూ అరుస్తూ సందడి చేస్తూ నాగ చైతన్యకు స్వాగతం చెప్పారు. అలాగే మూవీ టీమ్ అరసవల్లి సూర్య దేవాలయానికి వెళ్లగా అక్కడ కూడా భారీగా జనాలు వచ్చారు. చైతన్యతో పాటు సాయి పల్లవి కూడా ఉండటంతో ఆమె అభిమానులు కూడా భారీగా వచ్చారు. అయితే ఈ రేంజ్ లో అక్కినేని అభిమానులు వచ్చి మాస్ సెలబ్రేషన్స్ తో స్టార్ హీరో రేంజ్ లో నాగ చైతన్యకు స్వాగతం చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.