Helen Richardson : 85 ఏళ్ళ వయసులో జిమ్‌లో కష్టపడుతున్న నటి.. ఈ ఏజ్‌లో ఇంత ఫిట్‌గా..

హెలెన్ 85 ఏళ్ళ వయసులో కూడా జిమ్ లో కష్టపడుతుంది.

Helen Richardson : 85 ఏళ్ళ వయసులో జిమ్‌లో కష్టపడుతున్న నటి.. ఈ ఏజ్‌లో ఇంత ఫిట్‌గా..

Bollywood Actress Helen Richardson struggling in Gym at the age of 85 Workout Videos goes Viral

Updated On : June 19, 2024 / 1:05 PM IST

Helen Richardson : హెలెన్ రిచర్డ్‌సన్.. 1960, 70, 80 దశకాల్లో బాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డ్యాన్సర్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించింది. నేషనల్ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది హెలెన్. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది హెలెన్. సినిమాలకు దూరంగా ఉన్న తన బాడీ ఫిట్నెస్ మీద మాత్రం ఫోకస్ చేస్తూనే ఉంది.

Also Read : Mahresh Babu : చావుబతుకుల్లో వీరాభిమాని.. పిల్లలకు మహేష్ సినిమా పేర్లు.. పిల్లల్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు..

హెలెన్ కు ప్రస్తుతం 85 ఏళ్ళు. హెలెన్ ఈ వయసులో కూడా జిమ్ లో కష్టపడుతుంది. జిమ్ లో ఎక్సర్‌సైజ్ లు చేస్తుంది. జిమ్ ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకుంటుంది. తాజాగా జిమ్ ట్రైనర్ హెలెన్ తో చేసిన వర్కౌట్స్ తో పాటు హెలెన్ తో మాట్లాడిన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో 85 ఏళ్ళ వయసులో నటి ఈ రేంజ్ లో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. ప్రస్తుతం హెలెన్ వర్కౌట్స్ వైరల్ గా మారాయి.