Nandamuri Ramakrishna : నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం.. రామకృష్ణకి యాక్సిడెంట్.. నుజ్జునుజ్జయిన కారు..

 ఇటీవలే నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంకా కోలుకోకముందే నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.............

Accident and car damaged to nandamuri Ramakrishna

Nandamuri Ramakrishna :  ఇటీవలే నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంకా కోలుకోకముందే నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10 లో వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. చికిత్స అనంతరం ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నారు.

అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా నందమూరి కుటుంబలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక గతంలో కూడా నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్‌లు కారు యాక్సిడెంట్స్‌లోనే కన్ను మూయడం, ఎన్టీఆర్ కి కూడా యాక్సిడెంట్ అవ్వడం.. ఇప్పుడు నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ అవ్వడం.. ఇవన్నీ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు.

Tamannaah : కోయంబత్తూర్ లో తమన్నా పూజలు.. లింగ భైరవి అమ్మవారి గురించి గొప్పగా చెప్తూ వీడియో..

అయితే నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ గురించి కుటుంబం ప్రకటించలేదు. పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. యాక్సిడెంట్ కి గురైన కారుని కుటుంబ సభ్యులు తీసికెళ్ళిపోయారని సమాచారం.