ధర్మస్థలిలో ధీరుడు.. ‘‘ఆచార్య’’..

  • Publish Date - August 22, 2020 / 04:23 PM IST

Acharya First Look: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
గతంలో స్వయంగా చిరు చెప్పినట్టు ‘ఆచార్య’ అనే పేరునే ఖరారు చేశారు. మెగాస్టార్ నటిస్తున్న 152వ సినిమా ఇది.



కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధర్మస్థలి అనే ప్రాంతంలో చిరంజీవి దుండగులను అంతంచేసి వీరుడిలా కత్తిపట్టుకుని నిలబడి ఉన్నారు. చిరు పేదల తరపున పోరాడే విప్లవ నాయకుడిగా కనిపించనున్నారు. మోషన్ పోస్టర్ వీడియోకు స్వరబ్రహ్మ మణిశర్మ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ‘ఆచార్య’ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: తిరు, ఎడిటింగ్: నవీన్ నూలి.