Acharya Movie Locks World Television Premiere Date
Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ఇద్దరు మెగా హీరోలను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టినా, సినిమా వారిని అలరించడంలో సక్సెస్ కాలేకపోయింది.
RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్‌ను ఆచార్య తట్టుకోగలడా?
ఇక ఈ సినిమాను తాజాగా వరల్ట్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెరపై టెలికాస్ట్ చేయనున్నారు. అక్టోబర్ 23న సాయంత్రం 5.30 గంటలకు ఈ సినిమాను జెమిని టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు బుల్లితెరపై చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటించిన ఈ సినిమాలో వారిద్దరు కలిసి చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్‌ను ఆచార్య తట్టుకోగలడా?
అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రొడ్యూస్ చేయగా, మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. మరి ఆచార్య సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రిజల్ట్ లభిస్తుందో చూడాలి.