Anjana Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కూతుర్ని చూశారా? హీరోయిన్ లెవెల్..

తాజాగా అర్జున్ రెండో కూతురు అంజనా అర్జున్ వైరల్ అవుతుంది.

Anjana Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కూతుర్ని చూశారా? హీరోయిన్ లెవెల్..

Action King Second Daughter Anjana Arjun goes Viral

Updated On : April 18, 2024 / 5:23 PM IST

Anjana Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మెప్పించాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. అర్జున్ కి ఐశ్వర్య, అంజనా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఐశ్వర్య ఆల్రెడీ హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది. తాజాగా అర్జున్ రెండో కూతురు అంజనా అర్జున్ వైరల్ అవుతుంది.

అంజనా అర్జున్ తండ్రి, అక్క బాటలో సినిమాలోకి రాకపోయినా సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ తో బాగానే పేరు తెచ్చుకుంది. మోడల్ గా కూడా పలు ఫోటోషూట్స్ చేసింది. ఇటీవలే సర్జా వరల్డ్ అనే హ్యాండ్ బ్యాగ్స్ కంపెనీ స్థాపించి బిజినెస్ లో కూడా దూసుకుపోతుంది. అంజనా అర్జున్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈమెని చూసి హీరోయిన్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Sandeep Reddy Vanga : నిన్ను నా సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుపడుతున్నాను.. నటుడిపై సందీప్ రెడ్డి వంగ కామెంట్స్..

అక్కలాగే చెల్లి అంజనా కూడా సినిమా హీరోయిన్ అయితే బాగుండు, హీరోయిన్ గా బాగా సెట్ అవుతుంది అంజనా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో తన ఫొటోలతోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అంజనా మరి ఫ్యూచర్ లో హీరోయిన్ అవుతుందా లేక బిజినెస్ లో మరింత ఎదుగుతుందా చూడాలి. ప్రస్తుతానికి అయితే అంజనా అర్జున్ ఫోటోలు చూసి ఆమెని ఫాలో అయిపోతున్నారు నెటిజన్లు.