Raja Vikramarka: కామిక్ ట‌చ్‌తో యాక్షన్.. ‘రాజా విక్ర‌మార్క’ ట్రైల‌ర్‌!

ఆర్ఎక్స్ 100, గ్యాంగ్ లీడర్, చావు కబురు చల్లగా ఇలా వరస సినిమాలతో దూసుకొచ్చాడు యువనటుడు కార్తికేయ. కార్తికేయ ఇప్పుడు రాజా విక్రమార్కగా వచ్చేందుకు సిద్దమయ్యాడు. శ్రీ సరిపల్లి..

Raja Vikramarka: కామిక్ ట‌చ్‌తో యాక్షన్.. ‘రాజా విక్ర‌మార్క’ ట్రైల‌ర్‌!

Raja Vikramarka (1)

Updated On : November 1, 2021 / 7:06 PM IST

Raja Vikramarka: ఆర్ఎక్స్ 100, గ్యాంగ్ లీడర్, చావు కబురు చల్లగా ఇలా వరస సినిమాలతో దూసుకొచ్చాడు యువనటుడు కార్తికేయ. కార్తికేయ ఇప్పుడు రాజా విక్రమార్కగా వచ్చేందుకు సిద్దమయ్యాడు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ జంటగా నటించింది. రాజా విక్రమార్క సినిమా నవంబర్ 12న ఆడియెన్స్ ముందుకు రానుండగా తాజాగా మేకర్స్ రాజా విక్రమార్క ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Nargis Fakhri: నర్గీస్ అసలేంటీ అందం..!

ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ తర్వాత కార్తికేయ ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ దొరకలేదు. అందుకే ఈసారి ఎలాగయినా హిట్టు కొట్టాలని కసి మీద ఉన్నాడు. అదే రాజావిక్రమార్క ట్రైలర్ లో కనిపించింది. రాజా విక్రమార్క అనే టైటిల్ ఎందుకు పెట్టారో కానీ.. ట్రైలర్ కూడా అందుకు తగినట్టుగానే ఇంట్రెస్టింగ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. కామిక్ టచ్ తో కూడిన యాక్షన్ కామెడీగా ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ ద్వారా చెప్పేశారు.

Ashu Reddy: అషు పాప హద్దులు దాటేస్తుందా?

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ లో ముఖ్యమైన పాత్రలన్నింటి కాంబినేషన్లోని సీన్స్ కట్ చేశారు. రాజా విక్రమార్క లవ్, యాక్షన్, కామెడీని కలిపి అల్లుకున్న కథగా కనిపిస్తుండగా ‘ఎలకను పట్టుకోవాలంటే వెనకబడనక్కర లేదురా .. ఎరగా ఉల్లిపాయను పెడితే చాలు’ .. ‘నువ్వు తెలివైనవాడివని అనుకునేలోపే ఎంత ఎదవ్వో గుర్తు చేస్తావ్’ అనే డైలాగులు సరదాగా అనిపిస్తే.. విలన్ నోట్లో గన్ను పెట్టిన హీరో ‘ట్రిగ్గర్ నొక్కనా.. వద్దా’ అని అడిగే యాక్షన్ మార్క్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.