Aishwarya Arjun : ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు వివాహం.. ఫొటోలు వైరల్..

సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి ఘనంగా జరిగింది.

Actor Arjun Daughter Aishwarya Arjun Marriage happened With Umapathy Ramaiah Photos goes Viral

Aishwarya Arjun Wedding : సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి ఘనంగా జరిగింది. త‌మిళ సీనియ‌ర్ న‌టుడు తంబి రామ‌య్య కొడుకు ఉమాప‌తితో గ‌తేడాది అక్టోబ‌ర్ 17న ఐశ్వర్య నిశ్చితార్థం జరగగా నిన్న జనవరి 10న వీరి వివాహం జరిగింది.

Also Read : Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం

జూన్ 10న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే వీరి వివాహం వైభవంగా జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమం, జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరగగా నిన్న జూన్ 10న ఉదయం వివాహం జరిగింది. ఇక రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగనుంది. దీనికి అన్ని పరిశ్రమల నుంచి సినీ ప్రముఖులు హాజరవనున్నారు.

గత రెండు రోజులుగా ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండా చూసుకొని తాజాగా ఐశ్వర్య – ఉమాపతి పెళ్లి ఫొటోలు అధికారికంగా విడుదల చేసారు.