Actor director Manoj Kumar passes away at 87 after
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అభిమానులతో పాటు, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
1937 జూలై 24న మనోజ్ కుమార్ జన్మించారు. ఆయన అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి. 1957లో ఫ్యాషన్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కాంచ్ కీ గుడియా చిత్రంతో గుర్తింపు పొందారు. అమరవీరుడు, బెనిఫిట్, తూర్పు మరియు పడమర, రోటీ కపడా ఔర్ మకాన్, విప్లవం వంటి చిత్రాలు ఆయనకు మంచిపేరును తీసుకువచ్చాయి.
దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఆయన సినీ పరిశ్రమకు సేవలు అందించారు. దర్శకుడిగా, రైటర్‌గా, నటుడి ప్రేక్షకుల్లో చెదరని ముద్ర వేశారు. ఆయన తెరపై అనేక పాత్రలకు ప్రాణం పోసినప్పటికీ, దేశభక్తి చిత్రాల ద్వారా ఆయన మరింత గుర్తింపు పొందారు. ఈ కారణంగా ఆయన్ని భరత్ కుమార్ అని పిలిచేవారు.
తన కెరీర్‌లో మనోజ్‌కుమార్ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్రం ఆయన్ను సత్కరించింది.
ప్రధాని మోదీ సంతాపం..
మనోజ్‌కుమార్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ వార్త ఎంతో బాధించిందన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో మనోజ్‌కుమార్ ఒక ఐకాన్ అని, ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికి గుర్తుండిపోతాయన్నారు. ఆయన రచనల్లో జాతీయభావం ఉప్పొంగుతుంటుందని, అవి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deeply saddened by the passing of legendary actor and filmmaker Shri Manoj Kumar Ji. He was an icon of Indian cinema, who was particularly remembered for his patriotic zeal, which was also reflected in his films. Manoj Ji’s works ignited a spirit of national pride and will… pic.twitter.com/f8pYqOxol3
— Narendra Modi (@narendramodi) April 4, 2025