Actor Jr NTR approaches delhi high court over defamatory posts on social media
Jr NTR : సోషల్ మీడియాలో కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున సైతం న్యాయస్థానాలను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుతోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.