Actor Karthi Facebook has been hacked
Karthi : తమిళ స్టార్ హీరో కార్తీ.. పేస్ బుక్ అకౌంట్ హాక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ గా మారింది. ఇటీవలే ‘సర్దార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. స్పై యాక్షన్ థిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. పిఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ పలు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
karthi : కార్తీ జపాన్ మూవీ ఓపెనింగ్ గ్యాలరీ
తమిళనాట దాదాపు రూ.100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి, కార్తీ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసుకువచ్చేందుకు కూడా పనులు మొదలు పెట్టేసారు మేకర్స్. ఇక విషయానికి వస్తే కార్తీ పేస్ బుక్ అకౌంట్ హాక్ అయ్యిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. దాని తిరిగి పొందేందుకు తమ పేస్ బుక్ టీమ్ ప్రయతిస్తున్నట్లు వెల్లడించాడు.
కాగా ఇటీవలే కార్తీ తన 25వ సినిమా ‘జపాన్’ని ప్రకటించాడు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మాఫియా డాన్ కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తుంది.
Hello guys, my Facebook page has been hacked. We are trying to restore it with Fb team.
— Karthi (@Karthi_Offl) November 14, 2022