Actor Kartikeya obeisance to Sharwanad Foot Videos goes Viral
Sharwanand – Kartikeya : సాధారణంగా పెద్దవాళ్లకు మనం కాళ్లకు దండం పెడతాం. ఎవరైనా అయ్యప్ప మాలలో, లేదా వేరే ఏదైనా మాలలో ఉన్నప్పుడు చిన్నవాళ్ళైనా వాళ్ళ కాళ్లకు దండం పెడతాం. మన సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు అయ్యప్ప మాల రెగ్యులర్ గా వేస్తారని తెలిసిందే. హీరో శర్వానంద్ ప్రస్తుతం అయ్యప్ప మాలలోనే ఉన్నారు.
Also Read : Nivetha Pethuraj : కార్ డిక్కీ ఓపెన్ చేయమంటే.. పోలీసులతో గొడవ పడుతున్న హీరోయిన్..
హీరో కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమా మే 31న రిలీజ్ కాబోతుంది. దీంతో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్చవహించగా ఈ ఈవెంట్ కు శర్వానంద్ గెస్ట్ గా వచ్చారు. శర్వానంద్ మాలలో ఉండటంతో ఈవెంట్ కి రాగానే కార్తికేయ శర్వానంద్ కాళ్లకు నమస్కరించాడు. అలాగే స్టేజి మీదకు వచ్చాక మరోసారి శర్వానంద్ కాళ్లకు కార్తికేయ నమస్కరించాడు.
దీంతో కార్తికేయ శర్వానంద్ కాళ్లకు నమస్కరించిన వీడియోలు వైరల్ గా మారాయి. శర్వానంద్ మాలలో ఉండటంతో కార్తికేయ అలా కాళ్లకు దండం పెట్టడంతో అంతా కార్తికేయని అభినందిస్తున్నారు. కార్తికేయకు కూడా చాలా భక్తి ఉందని ఈ వీడియోతో అర్ధమవుతుంది.