Nivetha Pethuraj : కార్ డిక్కీ ఓపెన్ చేయమంటే.. పోలీసులతో గొడవ పడుతున్న హీరోయిన్..

తాజాగా నివేదా పేతురేజ్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

Nivetha Pethuraj : కార్ డిక్కీ ఓపెన్ చేయమంటే.. పోలీసులతో గొడవ పడుతున్న హీరోయిన్..

Nivetha Pethuraj Argue with Police regarding her Car Checking Video goes Viral

Updated On : May 30, 2024 / 9:42 AM IST

Nivetha Pethuraj : తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలతో మెప్పిస్తుంది నివేదా పేతురేజ్. చివరిసారిగా దాస్ కా ధమ్కీ సినిమాలో కనపడి అలరించి హిట్ కొట్టింది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది నివేదా పేతురేజ్. మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్ లో అదరగొడుతూ కప్పులు గెలుస్తుంది. అయితే తాజాగా నివేదా పేతురేజ్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో.. నివేదా పేతురేజ్ కార్ లో వెళ్తుంటే పోలీసులు చెకింగ్ కోసం ఆపారు. వెనక డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా చేయను, ఎందుకు, కావాలంటే పేపర్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చూసుకోండి అంటూ పోలీసులతో గొడవ పడుతుంది. ఇదంతా రికార్డ్ చేస్తుంటే ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అంటూ కెమెరాని తన చేత్తో మూసేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Prabhas : కార్తికేయ సినిమా షూటింగ్‌కి తన కార్ ఇచ్చిన ప్రభాస్.. అంత కాస్ట్‌లీ కార్..

అయితే నిజంగానే నివేదా పేతురేజ్ తన డిక్కీలో ఏమైనా తీసుకెళ్తుందా? పోలీసులకు చెకింగ్ కి సహకరించడానికి ఎందుకు భయపడుతుంది అని పలువురు కామెంట్స్ చేస్తుంటే.. ఈ వీడియో చూస్తుంటే ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసినట్లు ఉంది. పోలీస్, నివేదా ఎక్స్‌ప్రెషన్స్ కూడా యాక్టింగ్ చేసినట్టే ఉన్నాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి నివేదా పేతురేజ్ ని నిజంగానే పోలీసులు ఆపారా? లేక ఇదంతా ప్రమోషన్ స్టంటా తెలియాలంటే వేచి చూడాలి.