Prabhas : కార్తికేయ సినిమా షూటింగ్‌కి తన కార్ ఇచ్చిన ప్రభాస్.. అంత కాస్ట్‌లీ కార్..

భజే వాయువేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తికేయ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Prabhas : కార్తికేయ సినిమా షూటింగ్‌కి తన కార్ ఇచ్చిన ప్రభాస్.. అంత కాస్ట్‌లీ కార్..

Prabhas gives His Jaguar Car to Hero Kartikeya Bhaje Vaayu Vegam Movie Shoot

Updated On : May 30, 2024 / 8:50 AM IST

Prabhas : ప్రభాస్ అందరితో మంచిగా ఉంటూ అందరికి హెల్ప్ చేస్తాడని తెలిసిందే. ఫుడ్ విషయంలోనే కాదు తన చుట్టూ ఉన్న వాళ్లకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాడు ప్రభాస్. ఈ క్రమంలో ఏకంగా తన కారుని సినిమా షూటింగ్ కి ఇచ్చాడు. హీరో కార్తికేయ(Kartikeya) ‘భజే వాయువేగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్లో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈ సినిమాకు చాలామంది హీరోలు సపోర్ట్ చేసారు. మహేష్ బాబు మా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చిరంజీవి గారు టీజర్ రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ అన్న అయితే తన జాగ్వార్ ఎక్స్ కారుని మా సినిమా షూటింగ్ కి ఇచ్చారు అని తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్స్ మరోసారి ప్రభాస్ ని అభినందిస్తున్నారు.

Also Read : Kalki 2898 AD : ‘కల్కి’ సినిమా రిలీజ్‌కి ముందే సిరీస్ రిలీజ్.. పిల్లల కోసం స్పెషల్‌గా.. థియేటర్స్‌లో ఒక రోజు ముందే..

భజే వాయువేగం సినిమాలో హీరో యాక్షన్ సీన్ లో డ్రైవ్ చేయడానికి ప్రభాస్ తన జాగ్వార్ కారుని ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా యూవీ నిర్మాణ సంస్థలో తెరకెక్కింది. ఈ సంస్థలో ప్రభాస్ కి కూడా భాగముంది. దీంతో ఇలా కూడా ప్రభాస్ కారు ఇచ్చి సినిమాకు సపోర్ట్ చేసాడు. ఆల్మోస్ట్ 75 లక్షల కార్ అది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లకు వాడడంతో డ్యామేజీ కూడా అయి ఉంటుంది. అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చి ఉంటారు అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి హీరో కార్తికేయ సినిమా షూటింగ్ కి ప్రభాస్ తన కార్ ఇచ్చిన సంగతి ఇప్పుడు వైరల్ అవుతుంది.